ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ రోజురోజు కు శరవేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ వందల కేసులు నమోదవుతుండటం  కాస్త ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తుంది. అయితే ఈ మహమ్మారి వైరస్ సామాన్య ప్రజలకే కాదు ఏకంగా అధికారులను నాయకుల ను కూడా వదలడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లు కరోనా  వైరస్ బారిన పడ్డ విషయం తెలిసిందే. ఇక కొంత మంది అధికారులు కూడా మహమ్మారి వైరస్ బారిన పడ్డారు. 

 


 ఇలా సామాన్య ప్రజలే కాదు ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న అధికారులు నాయకుల ను కూడా  ఈ కరోనా  వైరస్ బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యం  లో అటు తెలంగాణ సర్కార్ పై కూడా తీవ్రస్థాయి లో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారులు నాయకులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడటం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారుతోంది. ఇక తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వద్దకు కూడా కరోనా  వైరస్ చేరింది. 

 


 గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గన్ మెన్ కు కరోనా  పాజిటివ్ రావడం సంచలనం గా మారిపోయింది. రాజా సింగ్ గన్ మెన్ కి కరోనా  లక్షణాలు కనిపించడం తో కరోనా  నిర్ధారిత పరీక్షలు చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో రాజా సింగ్ గన్ మెన్  ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఎమ్మెల్యే రాజా సింగ్ కి కూడా కరోనా  వైరస్ టెస్టులు చేసారు వైద్యులు. ఈ నేపథ్యం లో ఎమ్మెల్యే రాజా   సింగ్ కు పాజిటివ్ వస్తుందా నెగటివ్ వస్తుందా అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: