2008 సంవత్సరంలో ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమాన్ని ఇప్పటికి కూడా దేశం మరిచిపోలేదు. ఈ ఘటనలో ఏకంగా 166 మంది చనిపోయారు. అయితే తాజాగా ముంబై దాడులకు సంబంధించిన నిందితుడు తహావూర్ రాణా  జైలు నుండి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలై రోజులు గడిచాయో లేదో మళ్లీ అధికారులు అరెస్టు చేశారు. 2008లో జరిగిన ముంబై దాడులకు సంబంధించి చికాగో వ్యాపారవేత్త రానా ఉగ్రవాదులకు సహాయం అందుమించాడు అనే  పలు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులకు సహాయం చేసాడు అన్న ఆరోపణలు నిరూపణ కావడంతో... ఈ కేసులో ఆయనకు ఏకంగా 14 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది చికాగో కోర్టు. 

 


 ఈ క్రమంలోనే రానా 10 సంవత్సరాలకు పైగా జైలులో శిక్ష అనుభవించాడు. ఇక ఇటీవలే ఆయన ఆరోగ్య పరిస్థితులు క్షీణించడం... రానా కరోనా  వైరస్ బారిన పడడంతో వారం రోజుల క్రితమే జైలు నుంచి విడుదల అయ్యాడు రానా. అయితే ఉగ్రవాద దాడుల కేసులో నిందితుడైన రాణాను అప్పగించాలంటూ ఈ సందర్భంగా భారత్ కోరడంతో.,, జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే రాణా ను  మరోసారి అరెస్టు చేశారు పోలీసులు. జూన్ పదవ తేదీన లాస్ఏంజిల్స్ పోలీసులు రానా ను అదుపులోకి తీసుకున్నారు. 

 

 భారత్ అమెరికా మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు అధికారులు . ఇక 2008 సంవత్సరంలో నవంబర్ నెల లో ముంబై లో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మారణకాండలో పట్టుబడింది కేవలం కసబ్ మాత్రమే. మిగితా ఉగ్రవాదులు అందరూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. ఇక ఈ ఉగ్రవాదులకు సాయం చేశాడు అని ఆరోపణల తో రానా పై 2018 లో ఎన్ఐఏ అరెస్టు వారెంటు జారీచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: