ఓ మనిషి జీవితంలో వారికి సంతానం అనేది ఓ ముఖ్యమైన ఘట్టం. అందులో మరీ ముఖ్యంగా వివాహమైన తర్వాత అమ్మ అనిపించుకోవాలని ప్రతి ఆడదానికి ఉంటుంది. పిల్లల కోసం వారు అనేక కలలు కంటూ ఉంటారు. అలాంటిది పెళ్లయ్యాక వారికి సంతానం కలగకపోతే వారి బాధ వర్ణనాతీతం. పిల్లలు కలగకపోతే ఇరుగుపొరుగు వారు సూటిపోటి మాటలతో మానసికంగా హింసించడం, మరోవైపు అత్తగారింట్లో లేనిపోని మాటలు అనిపించుకుంటూనే కొంతమంది మహిళలు జీవితాన్ని వెళ్ళ కొడుతున్నారు. మరి కొంతమంది ఈ మాటలు తాళలేక సగం జీవితం లోనే ఆత్మహత్య చేసుకుంటున్నారు. 

 

IHG


తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... పెళ్లయి 15 సంవత్సరాలు గడిచినా కూడా పిల్లలు పుట్టలేదని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య కు పాల్పడింది. తూర్పుగోదావరి జిల్లాలోని కుడేరు మండలంలో ఉన్న పి. నాగిరెడ్డిపల్లి కు చెందిన ఓ వివాహిత సరస్వతి పురుగుల మందు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 

IHG

శ్రీరాములు అనే వ్యక్తి తో 15 సంవత్సరాల క్రితం పెళ్లయింది కానీ, ఇప్పటివరకు వాళ్లకి సంతానం కలగలేదు. వాళ్లు ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా సంతానం మాత్రం కలగలేదు. దీంతో ఆమె పూర్తి మానసిక క్షోభ కి గురయి గురువారం రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఆ సమయంలో బయటికి వెళ్లి వచ్చిన భర్త ఆమె పరిస్థితిని గ్రహించి వెంటనే అనంతపురం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షలు చేశారు. కానీ చికిత్స పొందుతూనే ఆమె మృత్యువాత పడింది. ఇకపోతే భర్త శ్రీరాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: