దేవుడి దర్శనానికే భగ్నం కలిగించి.. దేవుడికి భక్తులను దూరం చేసింది మాయదారి కరోనా.  కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దేవాలయాలు మూతపడ్డ విషయం తెలిసిందే. ఈ మద్యనే దేవాలయాలు పునఃప్రారంభించారు.  కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఇన్నిరోజులు మూసివున్న తిరుమల పుణ్యక్షేత్రం ఇటీవలే తెరుచుకున్న విషయం తెలిసిందే. భక్తుల రాకపోకలతో మళ్లీ తిరుమల శోభాయమానంగా కనబడుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కొండపైకి రావడంతో పున:వైభవం మొదలైందా అనిపిస్తోంది. అయితే, కరోనా నిబంధనలను కొండపైన పకడ్బందీగా అమలు చేయాలనుకుంటున్నారు ఆలయ అధికారులు. 

 

సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత ఇటీవలే తిరుమల పుణ్యక్షేత్రం మళ్లీ భక్తులతో కళకళలాడుతోంది.  అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వెంకన్న క్షేత్రంలో భక్తుల నడుమ భౌతికదూరం నిబంధన అమలు ఎంతో కష్టసాధ్యంగా కనిపిస్తోంది. ప్రోటోకాల్ ప్రకారం నిర్దిష్టదూరంలో ఉంటే మానిటరింగ్ స్క్రీన్ పై సదరు వ్యక్తులను పచ్చ రంగు మార్కుతో, నిబంధనలు ఉల్లంఘించి మరీ దగ్గరగా ఉన్న వ్యక్తులను ఎరుపు రంగు మార్కుతో సూచిస్తారు.

 

తద్వారా వారికి అప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు.  ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ డెవలప్ చేశారు. ఇది మొత్తం కంప్యూటరైజ్డ్ వ్యవస్థ ద్వారా చేపడతారు. ప్రస్తుతం ఈ సాఫ్ట్ వేర్ అభివృద్ధి దశలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు. అయితే  ఈ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి దశలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది.  అయితే ఇది ఎంత వరకు పాటిస్తారు.. దీని వల్ల ప్రజల్లో ఎంత వరకు అవగాహన వస్తుందన్న విషయం ముందు ముందు తెలియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: