యావత్ ప్రపంచాన్ని  భయ భ్రాంతులకు గురిచేస్తుంది కరోనా వైరస్..ఒకళ్ళతో మాట్లాడాలన్నా,కరచాలనం చేయాలన్న గాని ప్రజలు వణికిపోతున్నారు. అంతలా  ప్రపంచ దేశాలన్నీ చుట్టబెట్టింది ఈ వైరస్. కరోనా బారిన పడి చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి కొంతమంది హాస్పిటల్లోనే ఉన్నారు.ఎందుకంటే కరోనా వైరస్ కి మందు లేదు. కానీ ఇప్పుడు దేశ ప్రజలకు ఒక గొప్ప శుభవార్త.అదేంటంటే  కరోనా వైరస్  నియంత్రణకు ఔషధం సిద్ధమైంది.అవును మీరు విన్నది నిజమే. 

 

మన  భారత ఫార్మా దిగ్గజ కంపెనీ డ్రెస్ మార్క్ గూర్చి చెప్పక్కర్లేదు.. ఎంతో పేరు ఉన్న కంపెనీ. ఇప్పుడు ఈ కంపనియే  కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ కూడా చేశారట. అది కూడా  విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ్యయనం చేసిన డ్రెస్ మార్క్ కంపనీ " ఫవిపిరవిర్ "ఔషధం కరోనాతో బాధపడే  స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫాబిఫ్లూ బ్రాండ్ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి పొందినట్టు వెల్లడించింది.

 


అయితే ఈ మందు యొక్క ధర గూర్చి తెలుసుకుంటే ఒక్కో మాత్ర ధర రూ.103గా ఉంటుందని వెల్లడించారు.దేశవ్యాప్తంగా సాధ్యమైనంత త్వరగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని గ్లెనె మార్క్ ఛైర్మన్ గ్లెన్ సల్టన్హా అన్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ ఉంటేనే  ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్టు తెలిపారు. ఈ మందు ఎలా వాడాలంటే  కరోనా బారిన పడినవారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను మొదటి రోజు  రెండు సార్లు వేసుకోవాలనీ.. ఆ తర్వాత వరుసగా 14 రోజుల పాటు 800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రోజుకు రెండుసార్లు చొప్పున వాడాలని సూచించారు.అంటే మొత్తం మీద ఈ మందు కోర్స్ 15 రోజులన్నమాట.. డయాబెటిక్ పేషెంట్లూ, గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు కూడా ఎటువంటి భయం లేకుండా ఈ మందు  వాడొచ్చు అని తెలిపారు. 

 


అయితే  దేశంలో ఎన్నడూ లేనంతగా కేసులు పెరగడంతో దేశ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతున్న నేపథ్యంలో ఈ అనుమతులు లభించాయని ఆ సంస్థ ఛైర్మన్ గ్లెన్ సర్టైన్హా తెలిపారు.మొదట  క్లినికల్ ట్రయల్స్ సందర్భంలో ఫాబిఫ్లూను కరోనా రోగులపై ప్రయోగించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు.ఈ మందు వాడిన  నాలుగు రోజుల్లోనే వైరల్ లోడ్ తగ్గిస్తుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: