దేశంలో కరోనా వైరస్ రాక ముందు ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు  ప్రమాదాలు జరిగేవి.. పదుల సంఖ్యల్లో మరణాలు సంబవించేవి.  అయితే కరోనా వైరస్ భారత్ లో ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి అంటే మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ అయ్యింది. ఇక రోడ్లపై విచ్చలవిడిగా వాహనాలు నడవలేదు.. దాంతో ప్రమాదాలు కూడా తగ్గాయి. ఈ మద్య మళ్లీ లాక్ డౌన్ సడలించారు. దాంతో మళ్లీ ప్రమాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వలస కూలీలను తరలించే సమయంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆగ్రాలోని ఫ‌తేబాద్ పోలీసు లిమిట్స్ లో ఎస్ యూ వీ - ట్ర‌క్కును ఢీకొన‌డంతో ఒక‌రు ప్రాణాలు విడిచారు. 

 

మెయిన్ పురి జిల్లాలోని కుర్రా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్ ను ఢీకొట్టి బోల్తా ప‌డింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని య‌మునా, ఆగ్రా - ల‌క్నో ఎక్స్ ప్రెస్ వేపై వ‌రుస‌గా నాలుగు రోడ్డుప్ర‌మాదాలు జ‌రిగాయి. ఈ ప్ర‌మాదాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మ‌రో 9 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ల‌క్నో ఎక్స్ ప్రెస్ వేపై శ‌నివారం తెల్ల‌వారుజామున 5:30 గంట‌ల‌కు మ‌రో ప్ర‌మాదం జ‌రిగింది.

 

ఫిరోజాబాద్ జిల్లాలోని నాసిర్ పూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో కారు.. ట్ర‌క్కును ఢీకొట్టింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ వేర్వేరు ప్ర‌మాద ఘ‌ట‌న‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతదేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. డ్రైవ‌ర్లంద‌రూ నిద్ర మ‌త్తులో ఉండ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదాలు సంభ‌వించిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: