2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం అందరికీ తెలిసిందే. పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన తర్వాత మంత్రి పదవి చేపట్టడం తో లోకేష్ నాయకత్వం పై టీడీపీ నాయకులు, కార్యకర్తలు చాలా అంచనాలు పెట్టుకోవడం జరిగింది. కానీ తీర లోకేష్ పొలిటికల్ ఫీల్డ్ లోకి దిగిన తర్వాత ప్రసంగాలలో గాని పనితనంలో పెద్దగా మెప్పించలేకపోయారు. చాలాసార్లు బహిరంగ వేదికలపై మీడియా సమావేశంలో నవ్వుల పాలైన ఘటనలు చాలా ఉన్నాయి.

IHG

దీంతో నారా లోకేష్ పొలిటికల్ ఫీల్డ్ కి, పార్టీని నడిపించటానికి భవిష్యత్తు నాయకుడిగా పనికిరాడు అని అందరూ భావించారు. కానీ అది ఏంటో తెలియదు గానీ టీడీపీ లో వెరైటీగా ఈ లాక్ డౌన్ టైమ్ లో లోకేష్ తన పద్ధతిని తన భాషను ఆఖరికి తన బరువును మొత్తం మార్చుకుని సింగిల్ హ్యాండీల్ దిశగా ప్రతి పరిస్థితిని మీడియాని ఎదుర్కొంటున్నారు. చాలావరకు నారా లోకేష్ భాషలో పద్ధతిలో ఇదివరకంటే మార్పులు రావటంతో టీడీపీ లో నాయకులంతా నారా లోకేష్ పై గురి పెట్టారు.

IHG

జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో మరియు 'మహానాడు' సమయంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చార్జిషీటు అని వైసీపీ ఏడాది పరిపాలన విషయంలో లోకేష్ మాట్లాడిన తీరు వ్యవహరించిన విధానం టీడీపీ పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ విధంగానే కొనసాగి పార్టీ కార్యకర్తలకు నాయకులను కలుపుకొని పోరాటాల దిశగా అడుగులు వేస్తే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నడిపించే భవిష్యత్ నాయకుడు అవుతారని పరిశీలకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: