తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎన్నికైనప్పటి నుంచి... తెలంగాణలో బీజేపీ పార్టీ ని బలంగా మార్చేందుకు ఎంతో  వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు బండి సంజయ్. అయితే తాజాగా కేసీఆర్ సర్కార్ పై బీజేపీ ఎంపీ, బిజెపి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కబంధహస్తాల్లో తెలంగాణ తల్లి నలిగిపోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలు అందరూ మలిదశ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. అంతేకాకుండా కేసిఆర్ సర్కారును  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత సర్కార్ తో పోల్చారు బండి సంజయ్. 

 

 తెలంగాణ జన సంవాద్ వర్చువల్ ర్యాలీ  ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. బిజెపి కార్యకర్తలు అందరూ కేసులకు భయపడి వద్దని లాటీ దెబ్బలకు సిద్ధంగా ఉండాలని... ఏం జరిగినా తాను మీ కోసం వస్తాను అంటూ భరోసా ఇచ్చారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో టిఆర్ఎస్ సర్కార్ పాలన ఎంతగానో అధ్వానంగా ఉంది అంటూ వ్యాఖ్యానించిన బండి సంజయ్... దళిత మహిళలపై అత్యాచారాలు దాడులు లాంటి దారుణ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 


 ఎంఐఎం పార్టీకి చెందిన గుండాలు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎంఐఎం పార్టీ దగ్గర తాకట్టు పెట్టి కేసీఆర్ సర్కార్... నాటకాలు ఆడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ పాలన   పశ్చిమ బెంగాల్ లోనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ రాక్షస పాలనను తలపిస్తోంది ఘాటైన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. కరోనా  సంక్షోభ సమయంలో... నిబంధనలు తుంగలో తొక్కి  కొండపోచమ్మ చెరువు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మంది మార్బలం తీసుకెళ్లారని అందుకే ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారులు కూడా కరోనా  వైరస్ బారిన పడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: