పాకిస్థాన్ పీచమణచిన భారత్ ఇపుడు అదే దూకుడుతో చైనా మీదకు వెళ్తోంది. చైనా ఊహించని షాకులు ఇస్తోంది. నిజానికి భారత్ మెతకగా అన్నీ చూస్తూ ఊరుకుంటుందని, ఈ మధ్యలో భూ దందాలు చేస్తూ పబ్బం గడుపుకోవచ్చునని కుత్సితమైన ఆలోచనలు చేసిన చైనాకు ఇపుడు చెంప పెట్టు పెట్టేందుకు మోడీ సర్కార్ రెడీ అయింది.

 

ఓ విధంగా బరితెగించిన చైనాకు బుధ్ధి చెప్పేందుకు భారత్ కూడా  తెగించింది అని చెప్పాలి. యుధ్ధం వస్తే ఏమవుతుంది. మీ కన్నూ పొడిచేస్తాం, మీ ఒళ్ళూ గుల్ల చేస్తాం, ఇద్దరికీ దెబ్బలు తగులుతాయి, దానికి మేము సిధ్ధం, అందుకే యుధ్ధం అంటూ మోడీ సర్కార్ గట్టిగానే గర్జిస్తోంది. అందుకే కనీ వినీ ఎరుగని రీతిలో సరిహద్దుల్లో మోహరింపు జరుగుతోంది.

 


యుధ్ధ విమానాలను కీలకమైన ప్రాంతాల్లోకి చేర్చిన భారత్ వైమానిక దళాలు  సై అంటే సై అని కదనరంగంలోకి దిగాలనుకుంటున్నాయి. సిక్కిం, అరుణాచలప్రదేశ్ సహా, గాల్వాన్ లోయ సరిహద్దుల్లో కూడా గట్టిగానే బందోబస్తు సిధ్ధం చేశాయి. ఇది నిజంగా డ్రాగన్ కి ముచ్చెమటలు పోయించే అంశమే.

 

భారత్ తెగించదు అనుకుంటూ పాతకాలం ఆలోచనల్లో ఉన్న చైనాకు ఇపుడు సరైన షాక్ భారత్ ఇచ్చింది, ఇక్కడ ఉన్నది జాతీయ ప్రభుత్వం. ఆనాడు నెహ్రూకి నమ్మకద్రోహం చేసి టిబెట్ ని గుటుక్కున మింగేసి దొంగ యుధ్ధం చేసి గెలిచామని సంబరపడిన చైనాకు ఇప్పటి పాలకుల తీరు తెలిసో తెలియదో కానీ మోడీ తోక జాడిస్తే కట్ చేస్తారన్నది కూడా అర్ధం చేసుకోకపోతే మాత్రం చైనాకు అతిపెద్ద నష్టం జరితే వీలుంది. అసలే ఇపుడు చైనా చాలా కష్టాల్లో ఉంది

 

యుధ్ధం ఇద్దరికీ మంచిది కాదు కాబట్టి శాంతించి చర్చలకు వస్తే సరేసరి. లేకపోతే మేమూ నష్టపోతాం, చైనాని సమరపు మంటల్లో పెట్టి మండిస్తాం. ఇదే యుధ్ధ నీతిలో భారత్ దూకుడుగా అడుగులు వేస్తోంది. ఇపుడు చైనా చేతిలోనే బంతి ఉంది. శాంతి కావాలా. మారణహోమం కావాలా. తేల్చుకోవాల్సింది డ్రాగానే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: