ప్రస్తుతం ఇండియా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ తీవ్రస్థాయిలో బయటపడుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాలలో లాక్ డౌన్ మళ్లీ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. దీంతో కొత్త కేసులు నమోదవుతున్న విషయాలలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే సమయంలో వర్షాకాలం రావటంతో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల కరోనా విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యింది. ఇటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఇండియన్ ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా కి ఫాబిఫ్లూ అనే టాబ్లెట్ కనిపెట్టడం జరిగింది.

 

గ్లెన్ మార్క్ కంపెనీ కనిపెట్టిన ఫాబిఫ్లూ టాబ్లెట్ కు డ్రగ్ కంట్రలర్ జనరల్ ఆఫ్ ఇండియా (dcgi) కూడా ఆమోదం తెలిపింది. ఈ టాబ్లెట్ ఎప్పటికీ మూడు దశరా క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో గ్లెన్ మార్క్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దన్హా సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ఫాబిఫ్లూ బ్రాండ్‌ పేరిట యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌ టాబ్లెట్లను  మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ధినికి అవసరమైన అనుమతులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు ఇండియన్ డ్రగ్ కంట్రోల్ బోర్డు నుంచి అన్ని అనుమతులు వచ్చినట్లు ప్రకటించారు.

 

అంతే కాకుండా ఈ డ్రగ్ కరోనా వైరస్ తక్కువ మరియు మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ డ్రగ్ పని విధానం ఫ్లూ డ్రగ్ స్థితిగతుల్ని అంచనా వేస్తూ కరోనా వ్యాప్తిని తగ్గిస్తుందని త్వరలోనే దేశంలో అన్ని చోట్ల ఈ డ్రగ్ అందుబాటులోకి తీసుకురావటం కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. కేవలం 103 రూపాయలకే ఈ టాబ్లెట్ మార్కెట్లో ఇవ్వటానికి కంపెనీ కృషి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: