ముందుచూపు గల నాయకుడు చంద్రబాబుకు వెనుక చూపు తగ్గినట్లే ఉంది. బాగా విజన్ ఉన్న నాయకుడుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబుకు టెక్నాలజీని వాడుకుని ఏ విధంగా ముందుకెళ్లాలో బాగా తెలుసు. భవిష్యత్‌లో ఎలా ఉండాలో కూడా బాబు ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు. అయితే ఈ విధంగా ముందుచూపు ఉండటం వల్లే అనుకుంటా...బాబుకు వెనుక అనేక వెన్నుపోట్లు పడుతున్నాయి.

 

అంతా కొత్తగా ఉండాలనుకునే బాబు...తన వెనుక మాత్రం పాతతరం నాయకులని వేసుకుని తిరుగుతున్నారు. యువ నాయకులని ఎంకరేజ్ చేస్తే ఎక్కడ తన తనయుడుకు పోటీ వచ్చేస్తారేమో అని భయంతో భజన బృందాన్ని వెంటేసుకుని రాజకీయం చేస్తుంటారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ భజన బ్యాచ్‌ మాటలు వినే, 23 సీట్లకు పడిపోయారు. అసలు బాబు పాలనలో లోటుపాట్లని చెప్పకుండా భజన బ్యాచ్ అంతా అద్భుతమని చెప్పడం వల్ల జగన్‌కు చాలా మేలు జరిగింది.

 

ఏదో సాధారణ మెజారిటీతో గెలవాల్సిన జగన్ భారీగా సీట్లు తెచ్చుకుని అధికారం పీఠంలో కూర్చుకున్నారు. సరే ఎలాగో ఓడిపోయాం కాబట్టి ఇప్పటి నుంచైనా సరిగా పార్టీని చూసుకుంటూ, కార్యకర్తలని కలుపుకుని పోతూ మళ్ళీ పుంజుకుందామనే ఆలోచన బాబుతో సహ ఎవరికీ లేదు. ఇప్పుడు కూడా జగన్ పాలనలో ఫెయిల్ అయిపోయారు...ఇక నెక్స్ట్ మనదే అధికారం అని బాబుని తెగ లేపుతున్నారు.

 

అందుకే బాబుకు ఎంతసేపు భజన చేస్తూ...మనకు తిరుగులేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ భజన బ్యాచ్ ఈ మధ్య చినబాబుని కూడా హైలైట్ చేసే కార్యక్రమంలో పడింది. భవిష్యత్ అధ్యక్షుడు కాబట్టి, వారంతా కలిసి చినబాబుకు భజన చేస్తున్నారు. ఇక ఈ బ్యాచ్‌లో మాయలో పడి బాబు అసలు రియాలిటీ చెప్పే టీడీపీ నేతలనీ పక్కనబెట్టేస్తున్నారు. దీని వల్ల పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతుంది. ఇదే సమయంలో ఈ భజన బృందం వల్ల జగన్‌కే ఇంకా అడ్వాంటేజ్ పెరుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: