ఇటీవల శాసనమండలిలో వైసీపీ మరియు టీడీపీ పార్టీ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీ మంత్రులు మరియు సభ్యులు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాళ్లతో తన్నారు అని, అనిల్ కుమార్ యాదవ్ అనే మంత్రి జిప్ ఇప్పదీసి  అసభ్యకరమైన పదజాలం వాడినట్లు టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపించడం జరిగింది. అయితే ఈ గొడవ ఎందుకు వచ్చింది అన్న విషయానికి వస్తే సభలో ద్ర‌వ్య వినిమ‌య బిల్లు స‌హా ఏపీ సీఆర్‌డీఏ ర‌ద్దు, మూడు రాజ‌ధానుల ఏర్పాటు బిల్లుల‌ను వైసీపీ ప్రజా ప్రతినిధులు మండలిలో ప్రవేశపెట్టడం జరిగింది. వీటిపై చర్చ జరిపేందుకు మండలంలో చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు గొడవలకు కారణం అని తెలుస్తోంది.

 

ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులు ద్రవ్య బిల్లు చివరిలో చర్చించాలని మిగతా బిల్లును మొదట చర్చించాలని తెలుగుదేశం పార్టీ నేతలతో వాదానికి దిగారు. మరోపక్క టీడీపీ సభ్యులు ముందుగా ద్రవ్య బిల్లు పై చర్చ జరపాలని పట్టుబట్టారు. అది రెండో రోజు కాబట్టి చర్చకు పెద్దగా ఆస్కారం లేని తరుణంలో సభలో రచ్చ రచ్చ జరగటంతో వైసిపి సభ్యులు పోడియం చుట్టుముట్టారు. అయితే ఈ సమయంలో శాసనమండలిలో ఎమ్మెల్సీ నారా లోకేష్ తన సెల్ ఫోన్ లో మొత్తం చిత్రీకరిస్తున్నారట. ఇదే విషయాన్ని ఇటీవల వైసీపీ నేతలు మీడియా ముందు ఆరోపించడం జరిగింది. ఈ పరిస్థితి తో సభలో తీవ్ర ఘర్షణకు దారితీసింది అని లోకేష్ సైలెంట్ గా సభా నిబంధన లకు విరుద్ధంగా వీడియో చిత్రీకరించడానికి పద్ధతి ప్రకారం సభలో గందరగోళం సృష్టించారని వైసీపీ నేతలు ఆరోపించడం జరిగింది.

 

ఈ విషయంలో ఇప్పటివరకు నారా లోకేష్ నోరు మెదపలేదు. ప్రతిసారి ఆరోపణలు వచ్చే సమయంలో నిత్యం మీడియాతో ట‌చ్‌లో ఉండే ఆయ‌న .. ఇప్పుడు ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయ‌న ఎక్కడా కూడా బ‌య‌ట‌కు రాలేదు. వాస్తవానికి నారా లోకేష్ తప్పు చేయకుండా ఉంటే ఈ పాటికి మీడియా ముందుకి వచ్చి వివరణ ఇచ్చేవారు అని చాలామంది వైసీపీ నాయకులూ అంటున్నారు. మరోపక్క శాసనమండలి గొడవ విషయంలో లోకేష్ సైలెంట్ గా ఉండటానికి కారణం ఆయన చేసిన తప్పే అన్నీ సొంత టీడీపీ నేతలు భావిస్తున్నారు అన్న వార్తలు ఏపీ లో గట్టిగా వినబడుతున్నాయి. అంతేకాకుండా ఈ విషయంపై ఇటీవల మాట్లాడిన చంద్ర‌బాబు కూడా దాడి ఎవ‌రు చేశార‌నే విష‌యంపై మాట్లాడ‌కుండా వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేసేందుకు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: