ఊహించని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్... సంచలన నిర్ణయాలు...సరికొత్త పథకాలతో పాలన మొదలు పెట్టిన విషయం తెలిసిందే. మంత్రివర్గం ఏర్పాటు దగ్గర నుంచి...ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి పథకం ఓ సంచలనమే అయింది. అయితే జగన్ ఏ నిర్ణయం తీసుకున్న ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకిస్తూ వచ్చింది. ప్రతిదాన్ని నెగిటివ్ చేయడానికి ప్రయత్నించారు. అనుకూల మీడియా ద్వారా జగన్‌ పాలనపై దుష్ప్రచారం చేశారు.

 

అయితే టీడీపీ ఇలాంటి విష ప్రచారం చేయడం, కొన్ని జగన్ తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా అర్ధంకాక మొదట్లో వైసీపీలో ఉన్న న్యూట్రల్ అభిమానులు కాస్త కంగారుపడ్డారు. జగన్ పాలన పట్ల అనుమానంతో ఉండిపోయారు. అదేంటి జగన్ ఇలా చేస్తున్నారంటూ కొంతమంది కార్యకర్తలు పెదవి విరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక దొరకని సమయం, ప్రజావేదిక కూల్చిన సందర్భాల్లో రాష్ట్రంలో ఏం జరుగుతుందా అనే అనుమానం వ్యక్తం చేశారు.

 

కానీ వారికి వచ్చిన అనుమానాలు నిదానంగా పటాపంచలవుతూ వచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాలు నిదానంగా సక్సెస్ అవుతూ వచ్చాయి. మొదట్లో ఆ నిర్ణయాల వల్ల కాస్త ఇబ్బంది పడిన తర్వాత మాత్రం మంచే జరుగుతూ వచ్చింది. ఉదాహరణకు ఇసుక, మద్యం విషయాలు చూసుకోవచ్చు. ఇక కార్యకర్తలకు పూర్తిగా కాన్ఫిడెన్స్ వచ్చింది...సంక్షేమ పథకాలు విషయంలో...ఏపీ చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా జగన్ పథకాలు అందించారు.

 

అయితే ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే...చెప్పిన సమయానికి ఏ సీఎం కూడా పథకాలని అమలు చేయలేదు. కానీ జగన్ మాత్రం చెప్పిన సమయానికి మాట తప్పకుండా ప్రజలకు పథకాలు అందించారు. ఆర్ధిక పరిస్తితి బాగోకపోయినా, కరోనా వల్ల ఇబ్బందులు ఉన్నా కూడా జగన్ ప్రజలకు ఎలాంటి లోటు చేయలేదు. అసలు జగన్ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో లబ్దిపొందని కుటుంబం లేదు. అయితే ఇలా చేయడం వల్ల సొంత కార్యకర్తలే అనుమానాలు వీడి, అసలు జగన్ ఇంతలా ఎలా చేయగలుగుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  ఇలా చేసుకుంటూ పోతే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది కూడా తమ పార్టీనే అని గట్టిగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: