పెళ్లితో ఇల్లంతా సందడిగా ఉంది. అందరూ సరదాగా భోజనం చేసే సమయం అది. ఇక అంతే అక్కడే మొదలైంది అసలు కథ. బంధువులు ఎవరూ సరిగా రాలేదు అన్నారని పెళ్ళి కూతురు  వారు అన్నారని ఓ గొడవ మొదలైంది. చిన్న గొడవ కాస్త చినికి చినికి పెద్ద గొడవగా మారిపోయింది. ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగి పెద్ద గొడవ అయింది.

 


ఇక అసలు వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లపర్రు లో ఓ రెండు కుటుంబాల మధ్య పెళ్లి భోజనాల విషయంలో ఈ గొడవ జరిగింది. భోజనాల దగ్గర అటు పెళ్లి కూతురు కుటుంబం వారు ఇటు పెళ్లి కొడుకు కుటుంబం వారు గొడవ పడడం జరిగింది. ఈ ఘటనలో ఇరువర్గాల వారు కొట్టు కోవడం జరిగింది. అయితే అక్కడ జరిగిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అసలు ఏం జరిగింది అన్న విషయం చూస్తే ...ఈనెల 15వ తారీఖున స్థానికంగా ఓ వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ ఎవరింటికి వారు వెళ్లిపోయారు కూడా.

 


ఇకపోతే వార ఇంటి సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత యానాల భోజనాలు ఏర్పాటు చేయడం వారి ఆచారం. ఇక పెళ్లయిన మూడు రోజుల తర్వాత ఆ బోజనాలను ఏర్పాటు చేశారు పెళ్లి కూతురు వారు. ఇకపోతే ఆ విందు ఎక్కువ మంది బంధువులు రాకపోవడంతో అసలు గొడవ మొదలైంది. భోజనాలు సక్రమంగా జరగలేదని వారి బంధువులు ఎవరూ సరిగా రాలేదని పెళ్లి కొడుకు తల్లిదండ్రులని పెళ్లికూతురు వారు టార్గెట్ చేశారు.

 


వాళ్లు అందరూ భోజనాలు చేసినంత వరకూ సూటిపోటి మాటలతో వారిని రెచ్చగొట్టారు. మాటలతో రెచ్చగొట్టడంతో మాట మాట పెరిగి పెద్ద గొడవ గా మారిపోయింది. దీంతో ఇరువర్గాల వారు కర్రలతో విడుదలతో ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. ఈ గొడవలో ముగ్గురికి గాయాలయ్యాయి. గొడవ పడి గాయాలపాలైన వారిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గొడవ సద్దుమణిగిన తరువాత అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: