మణిపూర్ ప్రభుత్వం గురించి యావత్ భారతదేశానికి తెలుసు..! 2017 ఎన్నికలలో అడపాదడపా మెజారిటీతో మిత్రపక్షాల సపోర్టుతో , కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆకర్షించడం వలన బిజెపి మణిపూర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్ బి. సింగ్ 2017 మార్చి 15 వ తారీఖున మణిపూర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం తరఫున అనేక మంది బయట పార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ తో ప్రమాణ స్వీకారం చేశారు.

 


2017 ఎన్నికలలో బీజేపీ కి 21 సీట్లు రాగా, కాంగ్రెస్ 28 సీట్లు సంపాదించింది. అయినప్పటికీ మిత్రపక్షాలు ఎన్  పి ఎఫ్- 4, ఎల్ జె పి - 1 ఒక సీటు సంపాదించి బిజెపికి సపోర్ట్ చేయడం వలన మణిపూర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రభుత్వం నిలబెట్టుకుంది. మూడు సంవత్సరాలు పాలనను ఎంతోకొంత మెరుగ్గా పాలించిన. ఇప్పుడు కరోనా సంక్షోభం గట్టిగానే దెబ్బతీసింది. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన ఆరోగ్య శాఖ మంత్రి జయంత్ కుమార్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వెంటనే బిజెపి ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

 


ఎన్ని మలుపులు మధ్య సొంత పార్టీకి సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా బీజేపీకి తన మద్దతు ఉపసంహరించుకున్నట్టు తెలిపి కాంగ్రెస్ మద్దతు ఇస్తానని చెప్పారు. ఇదే అదునుగా చూసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 18వ తేదీన అవిశ్వాస తీర్మానానికి తెర లేపింది. అవిశ్వాస తీర్మానం సమయంలో గొడవలు జరగడం పార్టీ ఫిరాయింపు సులువుగా జరిగింది. దీనితో ఈ గొడవ కోర్టుకు చేరింది. ఇంతలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ స్పీకర్ సస్పెండ్ చేశారు. దీనితో సభను జూన్ 22 కు వాయిదా వేశారు. ఇన్ని పరిణామాల మధ్య బిజెపి బలం కోల్పోయి... ఎండిపోయిన చెట్టు గానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: