రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో అనేక నేరాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు దారి దోపిడీలు ముఠా దోపిడీలు మాత్రమే చూసే వాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆన్లైన్ లో మోసాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇక బ్యాంకు సంస్థల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందనే చెప్పాలి. ఇక మధ్యతరగతి కుటుంబాలు వారి చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకోవడానికి కోసం కొంత డబ్బును బ్యాంకులో పొదుపు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. కానీ చాలా మంది బడా బాబులు వాటిని మోసం చేస్తూ బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి చేస్తున్నారు.

 

 

ఇలాంటి పనులు చేయడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు చాలా నష్టపోతున్నాయి. ఇక ఇటీవల హైదరాబాదులో దాదాపు 2.5 కోట్లు బ్యాంకుల నుంచి రుణం గా పొందాడు ఓ వ్యక్తి. నకిలీ పత్రాలు చూపించి బ్యాంకు కి మోసం చేశాడు ఆ ఘనుడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ వ్యక్తి నకిలీ పత్రాలను తయారు చేసి కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న మోసగాడిని సిసిఎస్ ప్రత్యేక విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలంలో లింగోజిగూడ లో ఆ వ్యక్తి పేరిట ఉన్న 10,540 గజాల స్థలాన్ని నిమ్మగడ్డ రాజ గిరిధర్ కుమార్ మరో ముగ్గురి పేరిట విక్రయించారు. ఇక గిరిధర్ స్థలానికి తన కుమార్తెకు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది.

 


ఇక విషయంలో లావాదేవీల వ్యవహారంలో కర్నూలుకు చెందిన వెంకటశివారెడ్డి మరో ముగ్గురి కి సంబంధించిన పత్రాలు తమ పేరిట మార్చుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా 2018లో ఆ పత్రాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ నానల్ నగర్ బ్రాంచ్ లోని తనఖా పెట్టి మేనేజర్ ఈగర్బర్గ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2.9 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. కంపెనీని మూసేసి వాయిదాలు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. బ్యాంకు మేనేజర్ పై ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. దీనితో పోలీసులు నిందితుడైన వెంకట శివారెడ్డిని  అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: