ప్రపంచమంతా కరోనాతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారికి ఇంకా మందు, వ్యాక్సీన్ కనిపెట్టలేదు. వ్యాక్సీన్ కనిపెట్టేందుకు చాలా సమయం పడుతుందని అంటున్నారు. మరి అది కనిపెట్టేలోగో ఎన్ని లక్షల ప్రాణాలు గాల్లో కలుస్తాయో అన్నది అంతుబట్టకుండా ఉంది. అయితే ఇప్పుడు కరోనాకు ఓ ఇండియన్ కంపెనీ మందు కనిపెట్టిందన్న వార్త సంచలనంగా మారింది.

 

 

గ్లెన్ మార్క్ కంపెనీ కనిపెట్టిన ఈ మందు ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఫాబిఫ్లూ బ్రాండ్‌ పేరుతో ఈ టాబ్లెట్లను మార్కెట్లోకి విడుదలకాబోతున్నాయి.ఈ మందుకు ఐసీఎంఆర్ కూడా ఓకే చెప్పేసింది. అమ్మకానికి అన్ని రకాల అనుమతులూ ఇచ్చేసింది. కరోనా బారిన పడినవారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను మొదటి రోజు రెండు వేసుకోవాలి. ఆ ఇదే మందు 800 ఎంజీ డోసు టాబ్లెట్లు వరుసగా 14 రోజుల పాటు రోజుకు రెండుసార్లు చొప్పున వాడాల్సి ఉంటుంది.

 

 

కరోనా అమెరికాలో విజృంభిస్తున్న తొలిరోజుల్లో కరోనాను కట్టడి చేసేందుకు హైడ్రాక్వీక్లోరీక్వీన్‌ మాత్రలు బాగా పని చేస్తున్నాయని వార్తలు వచ్చాయి. ఆ మందు నిల్వలు ఇండియాలో గుట్టలు గుట్టలు ఉన్నాయి. దాంతో అమెరికా అధ్యక్షుడు ట్రంపు సైతం.. బాబ్బాబూ మోడీ.. కాస్త ఆ హెచ్‌సీక్యూ మాత్రలు మా అమెరికాకు పంపించవా అంటూ బతిమాలుకున్నాడు.

 

 

ఇప్పుడు ఈ ఫాబి ఫ్లూ మందు కనుక సరిగ్గా పని చేస్తే చాలు.. ఇక ప్రపంచమంతా ఇండియావైపు చూస్తాయి. మాకు ఇవ్వమంటే.. మాకు ఇవ్వమని ఇండియాను మందుల కోసం బతిమాలుకుంటాయేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: