ఇది ప్రపంచానికే ఓ గుడ్ న్యూస్.. ప్రపంచం వణికిపోతున్న ఓ పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న మహమ్మారికి మందు దొరికింది. ఇన్నాళ్లూ మనుషులను కనిపించకుండానే ముప్పు తిప్పలు పెట్టేసిన మాయ రోగం కోరలు పీకే అవకాశం వచ్చేసింది. కరోనాను అడ్డుకోవడమెలా అంటూ జుట్టుపీక్కుంటున్న వారికి పరిష్కారం లభించింది.

 

 

అదే ఇండియా కంపెనీ గ్లెన్ మార్క్ తయారు చేసిన ఫామిఫ్లూ బ్రాండ్ టాబ్లెట్లు.. కరోనాను తగ్గించేందుకు ఈ టాబ్లెట్లను గ్లెన్ మార్క్ కంపెనీ తయారు చేసింది. ఈ మందు కరోనాను తగ్గించేందుకు బ్రహ్మాండంగా పని చేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్ లో తేలిందట. ఇది వ్యాక్సీన్ కాదు.

 

 

ఇది నోటి ద్వారా వేసుకునే టాబ్లెట్ మందు. కరోనా లక్షణాలు ఉన్నవారు.. ఈ ఫాబి ఫ్లూ టాబ్లెట్లను దాదాపు 30 టాబ్లెట్ల కోర్సు వాడాల్సి ఉంటుంది. మధ్యలో బ్రేక్ ఇవ్వకూడదు. కోర్సు పూర్తిగా కంప్లీట్ చేయాలి. ఈ టాబ్లెట్లు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను మొదటి రోజు రెండు వేసుకోవాలి. ఇదే మందు 800 ఎంజీ డోసు టాబ్లెట్లు వరుసగా 14 రోజుల పాటు రోజుకు రెండుసార్లు చొప్పున వాడాల్సి ఉంటుంది.

 

 

క్లినికల్‌ ట్రయల్స్‌ సందర్భంలో ఫాబిఫ్లూను కరోనా రోగులపై ప్రయోగించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చాయని ఆ కంపెనీ ప్రకటించింది. కరోనా లక్షణాలు స్వల్ప, మధ్య స్థాయిలో ఉన్నవారు.. వారు మధుమేహ, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నవారైనా సరే.. ఈ ఔషధాన్ని వాడవచ్చట. అంతే కాదు.. ఈ మందు కేవలం నాలుగు రోజుల్లోనే వైరల్‌ తీవ్రతను తగ్గించేస్తుందట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: