ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా విషయంలో చైనానే తప్పు పడుతున్నాయి. దీంతో చైనా సరిహద్దు వివాదాలను సృష్టిస్తూ ప్రపంచ దేశాల దృష్టి మళ్లిస్తోంది. చైనా తన మిత్ర దేశమైన నేపాల్ ద్వారా భారత్ ను దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేసింది. దీంతో నేపాల్ మ్యాపుల పేరు చెప్పి గేమ్ ఆడుతోంది. కానీ యుద్ధం చేసే సామర్థ్యం లేకపోవడంతో నేపాల్ ప్రస్తుతం మౌనంగానే ఉంది. 
 
భారత్ తో వివాదానికి సిద్ధమైతే భవిష్యత్తుల్లో ఇబ్బందులు పడ్దాల్సి ఉంటుందని నేపాల్ భావిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం చైనా చెప్పిన మాటలకు అంగీకరిస్తోంది. చైనాతో వివాదం నెలకొన్న సమయంలో పాక్ ఉగ్రవాదులను పంపిస్తోంది. అయితే భారత సైనికులు ఉగ్రవాదులపై, ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ లో వరుసగా ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరుగుతున్నాయి. 
 
నీలం వ్యాలీలో ఉన్న పాక్ ఉగ్రవాదులపై భారత్ పెద్దఎత్తున దాడులు చేస్తోంది. భారత్ కు చైనాతో ఉదయం సమయంలో చర్చలు, మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. రాత్రి సమయంలో పాకిస్తాన్ వ్యవహారం కూడా ఇదే విధంగా ఉంది. పాక్ నుంచి ఉగ్రవాదులను పంపించడానికి ఆ దేశం చేస్తున్న ఎత్తుగడను భారత్ గుర్తించి రెండు దేశాలతో ఒకే సమయంలో యుద్ధం చేయడానికి కూడా సిద్ధమవుతోంది. 
 
భారత సైన్యం రెండు వైపులా రెండంచెల వ్యూహాన్ని వ్యవహరిస్తోంది. కశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదులను, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో భారత్ సక్సెస్ అయింది. తద్వారా పాకిస్తాన్ ను పరోక్షంగా భారత్ హెచ్చరిస్తోంది. చైనా సైనికులు శిబిరాలను కొంత వెనక్కు జరుపుకున్నాయని సమాచారం అందుతోంది. పాంగ్ వాన్ దగ్గర చైనా సైనికులు సరిహద్దులు దాటితే మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. చైనా పాక్ ను రెచ్చగొడుతోంటే పాక్ పై భారత్ దాడులు చేస్తూ వరుస షాకులు ఇస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: