కాంగ్రెస్ పార్టీ శతాధిక వ్రుధ్ధ పార్టీ. ఆ పార్టీ నుంచి ఎంతో మంది నాయకులు వచ్చారు. ఈ దేశాన్ని ఇంతలా ముందుకు తీసుకురావడంలో కచ్చితంగా కాంగ్రెస్ పాత్ర ఉంది. అయితే కాంగ్రెస్ లో మహనీయుల శకం అంతరించింది. వారసత్వం పోకడలతో పార్టీ క్రుశిస్తోంది. సోనియాగాంధీ రాహుల్ గాంధీల నాయకత్వం కాంగ్రెస్ కి సరైన దిశ చూపలేకపోతోంది.

 

ఓ వైపు చైనా మన మీదకు దారుణంగా దండెత్తివస్తోంది. అటువంటి విషమ పరిస్థితుల్లో దేశ ప్రధానిగా, పెద్దగా  మోడీ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మనం అంతా ఒకటి అన్న సందేశం ప్రపంచానికి చెప్పాలి. కానీ హాజరైన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం విమర్శలు కురిపించారు. కేంద్రాన్ని నిందించారు. మొత్తం అంతా మోడీ వైఫల్యం అన్నట్లుగా మాట్లాడారు.

 

చిత్రమేంటంటే ఆ మీటింగులో ఆంతా మోడీకి మద్దతు ప్రకటించారు. మమతాబెనర్జీ వంటి వారు సైతం మోడీ ఎలా అంటే అలా అన్నారు. ఇదంతా దేశం కోసం. కానీ ఆ తెలివిడి, వివేచన కాంగ్రెస్ కి లేకపోయింది అని అంతా అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ రోజుకో ట్వీట్ చేస్తూ మోడీ సర్కార్ మీద విమర్శలు చేస్తున్నారు.

 

అయితే అతనికి బీజేపీ పెద్దలు సమాధానం చెప్పనవసరం లేకుండా తాజాగా గాల్వన్ లోయలో  చైనాతో పోరులో  ఒక గాయడిన జవాన్ తండ్రి గట్టిగానే సమాధానం చెప్పారు. రాహుల్ జీ మీరు ఆందోళన పడకండి, మన సైనికులు చైనాను మట్టికరిపిస్తారు. విమర్శలు వద్దు అంటూ ఆ తండ్రి తనదైన శైలిలో రిటార్ట్ ఇచ్చాడు.

 

ఇది చాలదా దేశం మూడ్ ఎలా ఉందో కాంగ్రెస్ రాంగ్ ట్రాక్ లో ఎటువైపు వెళ్తుందో చెప్పడానికి. అయినా విమర్శలకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తే మాత్రం ఎవరూ ఏమీ చేయలేరు, ఇప్పటికీ ఈ దేశంలోని నూటికి తొంబై శాతానికి పైగా ప్రజానీకం మోడీ చేతుల్లో ఈ దేశం సేఫ్ గా ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు. మరి కాంగ్రెస్ పెద్దలు ఆ విషయం ఎపుడు తెలుసుకుంటారో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: