కరీంనగర్ జిల్లాలో కరోనా విజృంభిస్తుంది. నిన్న ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా 13 పాజిటివ్ కేసులు బయటపడడం తో జిల్లా వాసుల్లో ఆందోలన నెలకొంది. కరీంనగర్ తో పాటు ప్రస్తుతం జనగామ లో కూడా కరోనా ప్రభావం అధికంగానే  వుంది. నిన్న జనగామలో 10కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
 
నిన్న ఒక్క రోజే  రాష్ట్ర వ్యాప్తంగా 546కేసులు నమోదు కాగా అత్యధికంగా జిహెచ్ఎంసి లో 458, రంగారెడ్డి లో 50 కేసులు నమోదయ్యాయి అలాగే నిన్న రాష్ట్రంలో కరోనా తో 5గురు మరణించారు. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 7072 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 3506మంది బాధితులు కోలుకోగా ప్రస్తుతం 3363కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు కరోనా తో మరణించిన వారి సంఖ్య 203కు చేరింది. గత 24గంటల్లో మొత్తం 3188 శాంపిల్ టెస్టులు చేశారు. 
ఇదిలావుంటే దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. నిన్న ఒక్క రోజే  దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో15000కు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర లో 3784, ఢిల్లీ లో 3630 తమిళనాడులో 2396 కేసులు నమోదుకాగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 405000కు చేరింది. కాగా ఇప్పటివరకు 13000కు పైగా కరోనా మరణాలు సంభవించాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా సత్పలితాలను ఇవ్వడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: