టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో తాను దేశంలోనే సీనియర్ నాయకుడినని చెప్పుకునే వారు. 40ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా అంటూ తన గొప్ప తాను చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు ఆ 40ఏళ్ల అనుభవం కూడా ఎందుకూ పనికి రాకుండా పోతోంది. యువ నాయకుడి చేతిలో చంద్రబాబు ఎత్తులన్నీ చిత్తవుతున్నాయి.

 

 

అందుకు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలే ఉదాహరణ అంటున్నారు వైసీపీ నాయకులు. వైయస్‌ జగన్ ప్రభంజనం ముందు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు తోక ముడిచి దాక్కొని ఉండాల్సిన పరిస్థితి నెలకొందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

 

 

తెలుగుదేశం పార్టీ పతనమైపోయిందనేందుకు అసెంబ్లీ, ఎంపీ స్థానాలు నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. పతనానికి చేరిన తెలుగుదేశం పార్టీ రాజకీయ క్రీడలు ఆడేందుకు పసుపు మీడియాను అడ్డుపెట్టుకుంటుందన్నారు. ఇంట్లో ముసుగు వేసుకొని జూమ్‌ యాప్‌ ద్వారా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెడుతూ ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లుతున్నాడని ఎమ్మెల్యే సుధాకర్ బాబు మండిపడ్డారు. శాసనమండలిలో టీడీపీ దారుణంగా దిగజారిపోయిందన్నారు.

 

 

ఒక ఎంపీ, ఎమ్మెల్యేతో ప్రారంభమైన వైయస్‌ఆర్‌ సీపీ.. 151 ఎమ్మెల్యేలు, లోక్‌సభ, రాజ్యసభలో కలిపి 28 ఎంపీలకు చేరుకుందన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై ప్రజలు పెట్టిన నమ్మకమన్నారు సుధాకర్ బాబు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసి కూడా చంద్రబాబు దళిత వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దించాడన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం వైయస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: