ఇప్పటికే సరిహద్దు ప్రాంతం వద్ద చైనా దేశంతో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో భారతదేశం తలమునకలై ఉంటే ఇదే అదనుగా పాకిస్తాన్ వారు ఎలాగైనా భారతీయులను గట్టి దెబ్బ కొట్టాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారు. ఇప్పుడు పాకిస్థాన్ వైపు నుంచి కూడా దొంగ దెబ్బ వేసేందుకు కొన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి.

 

భద్రతా బలగాలలోని అత్యంత అప్రమత్తంగా ఉండే యూనిట్లు ఒక సరిహద్దు ప్రాంతంలో ఒక డ్రోన్ ను గాల్లోనే కాల్చేయడం జరిగింది. అయితే అతి ఎక్కువ ఎత్తులో చాలా అనుమానాస్పదంగా భారత్ పై నుండి వెళ్తున్న డ్రోన్ ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు కాల్చేయగా ఇది పాకిస్తాన్ కు చెందినది అని వారు గుర్తించారు.

 

అనుమానం వచ్చిన వెంటనే వారు దానిని పడగొట్టేందుకు 8 నుండి 9 రోజులు బుల్లెట్లు కాల్చినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు చెప్పగా షాకింగ్ విషయాన్ని వారి సీనియర్ ఆఫీసర్లకు తెలియజేయడం జరిగింది. అలాగే దీనిలో ఐదు నుండి ఆరు కేజీల వరకు పేలుడు పదార్ధాలు ఉన్న సరుకు ఉన్నట్లు ఆర్మీ వర్గాలు పరీక్షించి తెలిపినట్లు సమాచారం.

 

 

ఇకపోతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, జమ్మూ కశ్మీర్ యొక్క ఇన్ స్పెక్టర్ జనరల్ జమ్వాల్ మాట్లాడుతూ డ్రోన్ పాకిస్తాన్ కి చెందినది అని మరియు అది భారత్ లో రహస్య స్థావరం ఉంటున్న వారి ఉగ్రవాదులకు పంపేందుకు తయారు చేయబడిందని వెల్లడించడం గమనార్హం. ఇక్కడే దగ్గరలోని ఏదో ఒక గ్రామం లో వారు తల దాచుకుంటూ ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.

 

బి‌ఎస్‌ఎఫ్ బెటాలియన్ అంతర్జాతీయ బోర్డర్ కు 250 మీటర్ల దూరంలో డ్రోన్ ను నేలకూల్చడం జరిగింది. కాగా పాక్ ఇలాంటి రహస్య డ్రోన్ ద్వారా భారత్ సరిహద్దుల్లో ఫోటోలు తీయడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: