కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న వైరస్. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఎంతోమందిని ఎన్నో విధాలుగా నరకం చూపించి చంపుతుంది. అలాంటి ఈ వైరస్ కు ఎవరు అతీతం కాదు. ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రజలమధ్యకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే వచ్చేస్తుంది. 

 

IHG

 

పేద, ధనిక, చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికి ఈ కరోనా వైరస్ వస్తుంది. నమ్మకంగా చెప్పాలి అంటే ఈ కరోనా వైరస్ రానిది ఎవరికో తెలుసా? అన్ని జాగ్రత్తలు తీసుకొని రోగనిరోధక శక్తి ఎక్కువ ఉన్నవారికే ఈ కరోనా వైరస్ రాదూ. అందుకే అందరూ కూడా మాస్కు ధరించి శానిటైజర్ ఉపయోగించాలి అనేది. 

 

IHG

 

సరే.. ఇది అంత ఓకే.. మన దేశంలోనూ కరోనా కోరలు చాస్తుంది. మరి అలాంటి కరోనా వైరస్ ఇంకా దాయాది దేశం అయినా పాకిస్థాన్ లోను కరోనా వైరస్ రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. కేవలం గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 6,604 కేసులు నమోదయ్యాయని ఒక్క రోజులో ఏకంగా 153 మంది మృతి చెందినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. 

 

IHG

 

ఇంకా ఆ దేశంలో ఇప్పటివరకూ ఒకేరోజు ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి అని దీంతో పాకిస్థాన్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,71,665కి చేరగా, మృతుల సంఖ్య 3,382కి చేరింది. అయితే దేశవ్యాప్తంగా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 63,504 చేరింది. ఏది ఏమైనా మనదేశంతో పోలిస్తే అంత చిన్న దేశంలో కరోనా విజృంభణ ఎక్కువగానే ఉంది.. మెల్లగా పాకిస్థాన్ ను అంతం చేసుకుంటూ వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: