ప్రధాని నరేంద్ర మోడీ దూకుడుకు మొదట్లో రాజ్యసభ అడ్డుగా నిలిచేది. లోక్ సభలో ఫుల్ మెజారిటీ ఉన్నా.. బిల్లుల ఆమోదం కోసం రాజ్యసభలో ముందూ వెనుకా చూసుకోవాల్సి వచ్చేది. చిన్నాచితకా పార్టీల మద్దతు కూడా కీలకమయ్యేది. ఇప్పుడు క్రమంగా ఆ పరిస్థితి మారుతోంది. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలతో బీజేపీ బలం ఇంకాస్త పెరిగింది.

 

 

మొన్న దేశవ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో బీజేపీ 8 స్థానాలను చేజిక్కించుకుంది. కాంగ్రెస్‌, వైసీపీకి చెరో నాలుగు వచ్చాయి. ఇతరులు మూడు సీట్లు దక్కించుకున్నారు. ఈ ఫలితాలతో బీజేపీ బలం 86 కు చేరింది. రాజ్యసభలో మొత్తం సీట్ల సంఖ్య 245. ప్రస్తుతం జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీ బలం 86 కాగా.. ఎన్డీయే బలం 100 కు పెరిగింది. ఇక పెద్దల సభలో కాంగ్రెస్‌ బలం 41 సీట్లకే పరిమితం అయ్యింది.

 

 

 

బీజేపీపీ ఎన్డీఏ బలం కాకుండా బయటి నుంచి అనుకూలంగా అన్నాడీఎంకే, బీజేడీ, వైసీపీ వంటి పార్టీలు ఉన్నాయి. వీటిలో అన్నాడీఎంకే 9, బీజేడీ 9, వైసీపీకి 6 సీట్లు ఉన్నాయి. అందుకే ఏదైనా బిల్లుల సమయంలో ఈ పార్టీలు బీజేపీకి మద్దతు ఇస్తే చాలు.. రాజ్యసభలోనూ బీజేపీకి ఎదురు ఉండదు. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా ఇలాంటి పార్టీల మద్దతుతోనే బీజేపీ అనేక కీలక బిల్లులు ఆమోదించుకుంది.

 

 

మరి ఇప్పుడు రాజ్యసభలో బలం పెరిగిన నేపథ్యంలో బీజేపీ దూకుడు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అంతే కాదు.. ఇక ముందు ముందు బీజేపీ సీట్ల సంఖ్య పెరిగడమే కానీ తగ్గే అవకాశం లేదు. ఇప్పటికే మోడీ రెండో దఫా ఏలుబడిలో సంవత్సరం ముగిసిపోయింది. ఇక మిగిలిన నాలుగేళ్లలో బీజేపీ తనదైన మార్కుతో సంస్కరణలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: