చట్టంలోని లొసుగులు తెలిసిన నేరస్ధులు నేరాలు చేయడంలో అతి తెలివితేటలను ఉపయోగించి, చక్కగా ఆ తప్పులను వాడుకుంటారు.. అలాగే ఒక మహిళ విమాన ప్రయాణంలో ఉన్న లోపాలను గట్టిగానే వాడుకుని ఏకంగా 3.2 కోట్లు కొట్టేసింది.. ప్రయాణికుల సౌలభ్యం కోసం పెట్టిన ఆ పధకాన్ని వక్రమార్గంలో వాడుకుని క్యాష్ చేసుకుంది.. దొంగ ఎన్ని రోజులకైన దొరక వలసిందే. కానీ ఈమె దొరికేలోపలే కోట్లడబ్బు మెక్కేసింది.. ఈ కిలాడిలేడి ఖతర్నాక్ ప్లాన్ తెలిసిన వారెవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఆ వివరాలు చూస్తే..

 

 

కొన్ని దేశాల్లో విమానం ఆలస్యమైతే పరిహారం చెల్లించేలా ‘ఫ్లైట్‌ డిలే ఇన్సూరెన్స్‌’ ఇస్తుంటారు. టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ఆ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇదే సదుపాయాన్ని చైనాలోని నాన్‌జింగ్‌ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల లీ అనే మహిళ ఆదాయ మార్గంగా మలుచుకుంది.. ఈ క్రమంలో లీ, 2015 లో తొలిసారి ఓ విమానం ఆలస్యమైనందుకు ఇన్సూరెన్స్‌ డబ్బు అందింది. అప్పుడే ఫ్లైట్‌ డిలే ఇన్సూరెన్స్‌లో లొసుగులు గుర్తించిన ఆమె గట్టిగా ఆలోచించి పధకం ప్రకారం నాలుగేళ్లపాటు అదే పనిగా విమాన టికెట్లు కొనడం.. అవి కాస్త ఆలస్యం కావడంతో ఇన్సూరెన్స్‌ డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టింది.

 

 

ఈ నేపధ్యంలో తన పూర్వ విమాన ప్రయాణాలు, వాతావరణం, ఎయిర్‌ ట్రాఫిక్‌, విమాన సర్వీస్‌ రివ్యూల ఆధారంగా ఏయే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయో తెలుసుకుని, టికెట్లు బుక్‌ చేసేది. అయితే తనపేరు మీద ఎక్కువ టికిట్లు బుక్ చేసుకుంటే అనుమానం వస్తుందని గ్రహించిన ఈ మహిళ తన స్నేహితులు, బంధువుల పేర్లతో టికెట్‌ బుక్‌ చేసేది. అలా 2015 నుంచి 2019 వరకు దాదాపు 900 టికెట్లు బుక్‌ చేసి వాటిద్వార వచ్చే ఫ్లైట్‌ డిలే ఇన్సూరెన్స్‌ ద్వారా 4.23 లక్షల డాలర్లు అంటే మన డబ్బులతో పోల్చుకుంటే సుమారు రూ. 3.2 కోట్లు సంపాదించిందట.

 

 

ఇక కరోనా రావడం వల్ల విధించిన లాక్‌డౌన్ ఎత్తేసిన‌ అనంతరం విమాన సర్వీసులు పునరుద్ధరించడంతో లీ మళ్లీ ఇదే ప్లాను అమలుపరచడంతో పోలీసులకు చిక్కింది. ఇంకేం ఉంది చేసిన మోసాల చిట్టా మొత్తం బయటకు రాగా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టువారికి అప్పచెప్పారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: