జగన్ ఏపీ సీఎం. ఆయన ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నూటికి తొంబై శాతం తీర్చి మరీ మొనగాడు అనిపించుకున్నారు. సరే జగన్ ఎంత చేసినా కూడా ఏపీలోని బీజేపీ మాత్రం ఆయన్ని విమర్శిస్తూనే ఉంది. ఏపీలో ఏమీ చేయడంలేదనే అంటోంది.

 

అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం జగన్ వైపు చూస్తున్నారు. జగన్ మద్దతు కోసం వారు చూస్తున్నారు. ఇపుడు జగన్ చేతిలో ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఆయనకు లోక్ సభలో 22 మంది ఎంపీలు ఉన్నారు. లోక్ సభలో నాలుగవ అతి పెద్ద పార్టీగా ఉన్న జగన్ రాజ్యసభలో కూడా మంచి గుర్తింపు ఉన్న పార్టీగా  ఇపుడు ఉన్నారు.

 

రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తరువాత చూసుకుంటే రాజ్యసభలో బీజేపీ బలం 86 ఎంపీలు మాత్రమే. బీజేపీ బలం పెంచుకుంది కానీ ఇకా మెజారిటీకి యాభై సీట్లకు దూరంగా నిలిచింది. దాంతో బీజేపీని కీలకమైన బిల్లుల విషయంలో ఆదుకోవాల్సింది జగన్ అన్నది ఇక్కడ స్ప్ష్టమవుతోంది.

 

జగన్ నామస్మరణ గట్టిగా ఇక మీదట బీజేపీ చేయకతప్పదని కూడా అంటున్నారు. అయితే ఇదే అదనుగా జగన్ సైతం ఏపీలోని సమస్యలను కేంద్రం ముందు పెట్టి బీజేపీ రాజకీయ అవసరాలను తీరుస్తూ ఏపీకి కూడా మేలు చేసుకుంటే ఉభయతారకంగా ఉంటుందని అంటున్నారు.

 

 ఈ మధ్యనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాశి రాం మాధవ్ కూడా ఓ మాట అన్నారు. రాజ్యసభలో బీజేపీ సర్కార్ కి వైసీపీ మంచి మద్దతు ఇస్తోందని, అపుడు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నరు వైసీపీకి. ఇపుడు ఆరుగురు అయ్యారు. మరి జగన్ మీద మరింతగా బీజేపీ ఆధారపడకతప్పని పరిస్థితి ఉందిపుడు. చూడాలి మరి మోడీ ఈ కారణంగానైనా ఏపీ మీద దయ చూపిస్తారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: