నేడు సూర్య గ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్య గ్రహణం ప్రజలకు కనువిందు చేయనుంది. ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంది. ఈరోజు సూర్యుడి కేంద్ర భాగానికి మాత్రమే చంద్రుడు అడ్డుగా రాబోతున్నాడు కాబట్టి వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 16 సంవత్సరాలకు ఒకసారి జ్వాల వలయ సూర్య గ్రహణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. 
 
గ్రహణం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూతబడ్డాయి. దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం 9.15 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమై... మధ్యాహ్నం 12.10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. అయితే శాస్త్రవేత్తలు ప్రాంతాలను బట్టి సూర్య గ్రహణం సమయంలో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు గ్రహణం ఉంటుంది. 
 
ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు గ్రహణ సమయంగా ఉంది. ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా విశ్వ వ్యాప్తంగా 3 గంటల 33 నిమిషాల పాటు గ్రహణం ఉంటుందని వెల్లడించింది. మరోవైపు గ్రహణ సమయం కావడంతో గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని... కొన్ని పనులు అస్సలు చేయకూడదని సూచిస్తున్నారు. 
 
గర్భవతులు గ్రహణ సమయంలో పదునైన వాటిని పట్టుకోరాదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గ్రహణ సమయం లో ఏదీ తినరాదని చెబుతున్నారు. వీలైనంత వరకు పడుకొనే ఉండాలని... తలుపులు వేసి ఉంచడమే కాకుండా కిటికీలని న్యూస్ పేపర్ తో కానీ, దళసరిగా ఉన్న కర్టెన్లతో కానీ మూసివేయాలని సూచిస్తున్నారు. గ్రహణానికి ముందు వండిన ఆహారం తినరాదని.... గ్రహణం అయిపోయాక తలస్నానం చెయ్యాలని చెబుతున్నారు.                         

మరింత సమాచారం తెలుసుకోండి: