రాజకీయాల్లో గాంధీ ఫ్యామిలీ కి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నుంచి కూడా దేశ రాజకీయాల్లో గాంధీ ఫ్యామిలీ తమదైన ముద్ర వేసుకుని రాజకీయాలు చేస్తుంది అనే సంగతి తెలిసిందే. నెహ్రు నుంచి నేడు ఉన్న ప్రియాంక రాహుల్ వరకు కూడా రాజకీయం ఆ పార్టీ సమర్ధవంతంగా చేస్తూ వస్తుంది. ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఆయన తండ్రి స్థాయిలో కాకపోయినా సరే ప్రజల్లో ఇమేజ్ ని బాగా సంపాదించారు అనే చెప్పాలి. రాజకీయంగా పార్టీని ముందుకు సమర్ధవంతంగా ఆయన నడిపిస్తున్నారు. 

 

రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు హిందీ రాష్ట్రాల్లో అదే విధంగా కర్ణాటక లో కొంత కాలం పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బిజెపి వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాహుల్ గాంధీ ముందుకు నడిచారు. దాదాపు 20 ఏళ్ళు గా మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్ ని ఆయన సమర్ధవంతంగా కూల్చారు అనే చెప్పాలి. రాజకీయంగా బిజెపి ని ఆ రాష్ట్రంలో ఆయన సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు అనే చెప్పాలి. ఇక రాజస్థాన్ లో కూడా వసుంధరా రాజే ప్రభుత్వం తో పాటుగా చత్తీస్ఘడ్ లో రమణ సింగ్ ప్రభుత్వాన్ని ఆయన కూల్చారు. 

 

అయితే కాంగ్రెస్ పార్టీకి హిందుత్వ వాదం అనేది ఇబ్బంది గా మారడం  దానికి తోడు ప్రజల్లో మోడికి ఇమేజ్ ఎక్కువగా ఉండటం తో రాహుల్ గాంధి నిలబడటం అనేది కాస్త కష్టంగా మారింది అనే చెప్పాలి.  ఆయనకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది గాని దాన్ని రాహుల్ కాపాడుకునే విషయంలో విఫలం అవుతున్నారని అంటారు. అయితే ఈయన చేసిన రాజకీయం అప్పట్లో తండ్రి చేయలేదు. ఇందిరా ఇమేజ్ తోనే రాజీవ్ పైకి వచ్చారు. ఆ తర్వాత ప్రధానిగా తీసుకున్న నిర్ణయాలు ఇబ్బంది పెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: