వారసత్వం  నిలబెట్టుకోవడం అంటే అదేదో ఆషామాషీ పని కాదు. మామూలుగా ఏదైనా వ్యాపారం చేస్తే దాన్ని లాభాలు వచ్చిన కష్టాలు వచ్చినా పర్లేదులే అనుకోవచ్చు... కానీ తండ్రి నుంచి వచ్చిన వారసత్వం నిలబెట్టుకొవాలంటే  వ్యాపారాన్ని అంతకంతకు అభివృద్ధి చేయడం అంటే ఎంతో కష్టమైన పని. కానీ ఇలాంటి కష్టమైన పని ఎంతో సులువుగా చేసి తండ్రికి తగ్గ తనయుడిగా విజయం సాధించారు ముఖేష్ అంబానీ. ధీరుబాయ్ అంబానీ అసలు సిసలైన వారసుడిగా పేరెన్నిక గన్నారు. దిరుభై అంబానీ అంటే నేటి తరానికే కాదు భవిష్యత్తు తరానికి కూడా స్ఫూర్తి గా నిలుస్తారు అన్న విషయం తెలిసిందే.. 

 


 ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ధీరుబాయ్ అంబానీ ఎన్నో ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొన్నారు. కానీ డబ్బు సంపాదించి  ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడమే లక్ష్యంగా దృఢమైన  పట్టుదలతో ముందుకు సాగారు. ఒక పెట్రోల్ పంపులో  అటెండర్ గా పనిచేసిన వ్యక్తి ఏకంగా తదనంతర కాలంలో... భారతదేశంలోనే పెద్ద సంపన్నుడిగా మారిపోయాడు . ఇదంతా కేవలం ఒక్క నైట్ లో ఒక్క రోజులో వచ్చేదికాదు ఈ ఖ్యాతి  వెనుక ఎంతో కష్టం ఉంటుంది  అయితే ధీరుబాయ్ అంబానీ సంకల్పంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఏకంగా  సంపన్నుడిగా ఎదిగాడు. ఆ తర్వాత తన వారసులు  అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ లకు  తన ఆస్తిపాస్తులను సమంగా పంచాడు అనే చెప్పాలి. 

 


 అయితే ఇద్దరు వారసులకు ఆస్తి సమంగా పంచి నప్పటికీ ముఖేష్ అంబానీ మాత్రం తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని మరింత పెంచాడు అనే చెప్పాలి. కానీ అనిల్ అంబానీ మాత్రం ఎప్పుడూ నష్టాలు చవి చూస్తూ వచ్చారు. ఇలా ముఖేష్ అంబానీ తన తండ్రికి అసలు సిసలైన వారసుడిగా వ్యాపార రంగంలో నిలదొక్కుకుంటున్నారు . ప్రస్తుతం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో మొదటి వరుసలో నిలుస్తారు ముఖేష్ అంబానీ. తండ్రి వారసత్వంగా వచ్చిన రిలయన్స్  సంస్థను మరింత మెరుగుపరిచి... ఈ సంస్థకు మరింత ఖ్యాతిని పెంచారు ముఖేష్ అంబానీ.

మరింత సమాచారం తెలుసుకోండి: