ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంను జరుపుకుంటాము. 2014 సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం గురించి ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదన చేశారు. 193 ప్రపంచ దేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించాయి. డిసెంబరు 11వ తేదీన ఐక్యరాజ్యసమితి భారత ప్రధాని సూచించిన జూన్ 21 నాడు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవమును జరుపుకోవాలని అధికారికంగా ప్రకటన చేసింది. 
 
నాటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంను జరుపుకుంటున్నాయి. ప్రధాని మోదీ యోగాతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని... రోజువారీ జీవన విధానంలో ప్రాణాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఆరోగ్యమే కాదు లక్షల రూపాయల నగదు కూడా సంపాదించవచ్చు. యోగా శిక్షణ తీసుకుని సర్టిఫికెట్ ను సొంతం చేసుకున్న వారు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. 
 
యోగా ద్వారా ఆదాయం సంపాదించాలనుకునేవారికి ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల కఠినమైన శిక్షణ అవసరం. దేశంలోని కొన్ని పెద్ద సంస్థలు మాత్రమే యోగా శిక్షణను అందిస్తున్నాయి. అనుభవం, కీర్తి పెరిగే కొద్దీ యోగా ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. యోగా స్టూడియోలు, ఫిట్ నెస్ కేంద్రాలు ఆధునిక యోగాలో చాలా ముఖ్యమైనవి. విదేశాల్లో సైతం యోగాకు ప్రాధాన్యత పెరిగింది. 
 
యోగా శిక్షకునిగా కెరీర్ ను ప్రారంభించిన వారు నెలకు 20,000 నుంచి 30,000 సంపాదించే అవకాశం ఉంటుంది. నిర్ధిష్ట వ్యాధులతో బాధ పడే వారికి యోగా నేర్పించడం ద్వారా అంతకంటే ఎక్కువే సంపాదించే అవకాశం ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి ఇతరులకు శిక్షణ ఇవ్వవచ్చు. ఇలా చేస్తే లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: