ఆంధ్రప్రదేశ్ లో  చంద్రబాబు కుటుంబానికి ఉన్న రాజకీయ అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ సహకారం తో పైకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు బలమైన నేతగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన దాదాపు గా 4౦ ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఇక ఆయన తనయుడు నారా లోకేష్ విషయానికి వస్తే చంద్రబాబు ని మించిన నాయకుడు ఆయన కాలేదు అని చాలా మంది అంటూ ఉంటారు. అవును లోకేష్ రాజకీయం చూసిన చాలా మంది మాట్లాడే మాట అదే. తండ్రి ని మించిన నేత అవ్వలేదు అని.

 

లోకేష్ కి తెలుగు మాట్లాడటం నుంచి ప్రజల్లోకి వెళ్ళడం వరకు ఏదీ కూడా తండ్రి తరహాలో రాలేదు అనే చెప్పాలి. ఆయన వైఫల్యాలు అదే విధంగా రాజకీయం జోక్యం కారణంగానే పార్టీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైంది అని చాలా మంది రాజకీయ పరిశీలకులు అంటూ ఉంటారు. లోకేష్ ని ఎదుర్కోవడానికి సిఎం జగన్ కి పెద్దగా కష్టం కూడా ఏమీ అనిపించలేదు అనే చెప్పాలి. రాజకీయంగా గత ఏడాది ఎన్నికల ముందు వరకు టీడీపీ బలంగా ఉంది అనుకున్నా సరే లోకేష్ తప్పులు మాత్రం పార్టీని బాగా ఇబ్బంది పెట్టాయి. 

 

చంద్రబాబు కి అండగా ఉండాల్సిన సమయంలో లోకేష్ లేరు అని చాలా మంది రాజకీయ పరిశీలకులు అంటూ ఉంటారు. అదే టీడీపీ ని నేడు రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న పరిణామం అని చెప్తారు. ఇక ఇది పక్కన పెడితే రాజకీయంగా కూడా లోకేష్ కి చాలా వరకు భవిష్యత్తు లేదు అనేది చాలా మంది మాట్లాడే మాట కూడా. మరి ఆయన ఏ విధంగా రాజకీయంగా నిలబడతారు అనేది చూడాలి. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: