భారత్ పై కరోనా పంజా విసురుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ఏడాది చివరినాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వవిద్యాలయం త‌యారు చేస్తున్న‌ కరోనా వ్యాక్సిన్ ఏజెడ్‌డీ 1222 సత్ఫలితాలను ఇస్తోంది. 
 
యూరప్‌లోని చాలా దేశాలు ఆక్స్‌ఫర్డ్‌కు ఈ వ్యాక్సిన్ పరీక్షలను విజయవంతం చేయడానికి సహాయసహకారాలు అందిస్తున్నాయి. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ త‌యారుచేస్తున్న ఈ టీకా వివిధ దేశాలు తయారు చేస్తున్న టీకాల కంటే ముందే అందుబాటులోకి రానుంది. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే భారత్ సహా ఇతర దేశాలు ఈ వ్యాక్సిన్ ను తయారు చేయనున్నాయి. ఈ వ్యాక్సిన్‌ను మొదట కొద్దిమందిపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయి. 
 
త‌దుప‌రి ద‌శ‌లో వేలాదిమందిపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించారు. దీనికి సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఇటలీలోని రోమ్‌కు చెందిన‌ అడ్వెంట్ సంస్థ భారీ స్థాయిలో పరీక్షల కోసం వ్యాక్సిన్ సప్లిమెంట్లను తయారు చేసింది. ఆక్స్‌ఫర్డ్ రూపొందించే వ్యాక్సిన్ టెస్టింగ్ చివరి దశకు వ‌చ్చిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 
 
మరోవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 15,413 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 4,10,461కు చేరింది. దేశంలో 2,27,756 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 1,69,451 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.        

మరింత సమాచారం తెలుసుకోండి: