ఈ మధ్యకాలంలో మనిషిలో మానవత్వం కరువైపోతుంది. దీంతో కర్కశంగా మారిపోయి ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు చాలానే తెరమీదకు వస్తున్నాయి, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కృష్ణాజిల్లా నందిగామ మండలం మొగిలిచర్ల గ్రామంలో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. గుంటూరు  నవీన్ అనే జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈనెల 14వ తేదీన కనిపించకుండా పోయిన జర్నలిస్ట్ నవీన్.. శనివారం సాయంత్రం నందిగామ లోని కాకతీయ పాఠశాల రోడ్డు చివర లో ఖాళీగా ఉన్న స్థలంలో విగతజీవిగా కనిపించాడు. అయితే నవీన్ మరణంతో కుటుంబం మొత్తం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. 

 

 ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నవీన్ గత కొంతకాలంగా క్రైమ్ ఇండియా  పేరిట వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి నందిగామ ప్రాంతంలోని అనేక వివాదాస్పద స్థలాల్లో  అక్రమాలపై పోస్టింగులు పెడుతున్నాడు. దీంతో అనేక మంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై రౌడీషీట్ కూడా తెరిచారు, ఈ క్రమంలోనే అతనికి శత్రువులు కూడా ఎక్కువయ్యారు. 14వ తేదీ నుంచి నవీన్ కనిపించకపోవడంతో... కంగారు పడిపోయిన అతని తల్లి అలవేలు పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సీఐ ఇసోజు  కేసు నమోదు చేసి అనుమానితులను విచారించారు. 

 

 ఇక ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారంతో డీఎస్పీ తాసిల్దార్ చంద్రశేఖర్ సమక్షంలో మృతదేహాన్ని వెలిక్కి  తీసి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే నవీన్ హత్యకు కారణం  సాయి అనే వ్యక్తి తో ఉన్న పాత గొడవలే అని  పోలీసులు చెబుతున్నారు. 14వ తేదీ రాత్రి నవీన్ సైకిల్పై వెళుతుండగా పట్టణ శివారులో పనస నగర్ వద్ద సాయి కే రమణ అనే ఇద్దరు వ్యక్తులు నవీన్ ని అడ్డగించి సెల్ఫోన్ లో ఫోటోలు ఎందుకు తీస్తున్నావ్ అంటూ ప్రశ్నించారు ఈ క్రమంలోనే వారి మధ్య వివాదం తలెత్తడంతో నవీన్ తలపై బండరాయితో మోది హత్య చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: