విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి.. వాటిని తిలకించే అరుదైన సమయం అతి కొద్ది సమయమే దక్కుతుంది.  ఆకాశంలో అరుదైన సుందర దృశ్యం కనువిందు చేస్తోంది. రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ రోజు ఉదయం 9.16 గంటల నుంచి ప్రారంభమైన సూర్య గ్రహణం మధ్యాహ్నం 3.04 గంటల వరకు ఉంటుంది. ఈ గ్రహణాన్ని చూడటానికి దేశవ్యాప్తంగా పలుచోట్ల జనం ఉత్సాహం చూపుతున్నారు.  సూర్యగ్రహణాన్ని నేరుగా, ఎక్స్‌రే ఫిలిం, నల్లని గాజు ముక్కల ద్వారా చూడడం ప్రమాదకరమని తెలిపారు. వైద్యులు సూచించిన ఎక్లిప్స్‌ అద్దాలతోనే గ్రహణాన్ని చూడాలని సూచించారు. ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌, డెహ్రాడూన్‌ తదితర ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది. హైదరాబాద్‌తోపాటు మిగతా చోట్ల పాక్షికంగానే కనిపిస్తుందన్నారు.

సూర్యగ్రహణాన్ని నేరుగా, ఎక్స్‌రే ఫిలిం, నల్లని గాజు ముక్కల ద్వారా చూడడం ప్రమాదకరమని తెలిపారు.‘యాన్యులర్‌’ అనే పదం ‘యాన్యులస్‌’ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. దీనికి ఉంగరం అని అర్థం. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో, హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల్లోని దీవుల్లో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనువిందు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో ఉదయం 10.15 గంటలకు, ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటలకు గ్రహణం మొదలైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. తెలంగాణలో 51 శాతం, ఏపీలో 46 శాతం కనిపిస్తుందని వివరించారురాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ కారిడార్ వెంట గరిష్టంగా 30 సెకన్ల పాటు ముత్యాల హారంగా సూర్యుడు కనిపిస్తాడు. 

పూర్తిస్థాయిలో వలయాకార సూర్య గ్రహణం ఏర్పడడం గమనార్హం. సూర్యుడి కేంద్ర భాగం కనపడకుండా అడ్డుగా జాబిల్లి వచ్చింది.  తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం సూర్యుడు కనిపిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 నుంచి మధ్యాహ్నం 1.49 వరకు 46 శాతం కనిపిస్తాడు. ఇలాంటి అరుదైన ఘటన మళ్లీ 2031లోనే భారత్‌లో ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: