ఈ మధ్య కాలంలో టిక్ టాక్ ని ఎక్కువగా ఉయోగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నెటిజన్లకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పంచుతున్న యాప్ లలో  టిక్టాక్ మొదటి వరుసలో నిలిచింది. ఎన్ని కొత్త యాప్స్  వచ్చినప్పటికీ టిక్ టాక్ క్రేజ్ మాత్రం తగ్గించ లేకపోతున్నాయి అనే చెప్పాలి. అయితే ఇక్కడ టిక్టాక్ ఏకంగా  ఐదుగురు యువకులను అదృశ్యం చేసింది. టిక్ టాక్ మోజులో పడిన ఐదుగురు యువకులు భారీగా డబ్బు సంపాదించాలన్న వ్యామోహంతో అదృశ్యమైపోయారు. దీంతో తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది అనే చెప్పాలి. 

 


 ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. టిక్ టాక్ మోజులో పడి 5 గురూ యువకులు  ఒకసారి అదృశ్యం కావడం తో.. కంగారు పడిపోయిన తల్లి పోలీసులను ఆశ్రయించేందుకు ఫిర్యాదు మేరకు నగరం ఎస్ఐ  సతీష్ బాబు కేసు నమోదు చేసుకుని యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు, అమలాపురం డీఎస్పీ  షేక్ మాసూమ్  చెబుతున్న కథనం ప్రకారం... మామిడికుదురు,  నగరం గ్రామానికి చెందిన నలుగురు యువకులు కాకినాడకు చెందిన మరో యువకుడితో కలిసి... శుక్రవారం తర్వాత అర్ధరాత్రి ఇంటి నుంచి అదృశ్యమయ్యారు వీరు రెండు బైక్ల పై వెళ్ళిపోయారు అంటూ సమాచారం తెలిపారు. 

 


 అయితే ఈ యువకులకు గతంలో పలు రకాల టిక్ టాక్ లో చేసిన అనుభవం వుంది. మరి ఈ యువకులు  ఎక్కడికి వెళ్లారు అన్నది మాత్రం మిస్టరీ గా మారిపోయింది అని చెప్పాలి.ఇక  ఈ క్రమంలోనే ఓ యువకుడు తాము డబ్బు సంపాదన కోసం వెళ్తున్నాము.. తమకు కుటంబం  ఎటువంటి ఆందోళన చెందొద్దు అంటూ లెటర్ రాశాడు. ఇక ఇలా అదృశ్యమైన వారిలో మైనర్ బాలురు ముగ్గురు ఉండగా... 18 ఏళ్ల వయసున్న వారు ఇద్దరు ఉన్నారు. ఇక ఆ ఐదుగురి కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులు పలు వివరాలను సేకరించారు. ఇక యువకులని కనిపెట్టేందుకు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: