ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఎవరిని విడిచి పెట్టడం లేదు. ఏ మంత్రి అయినా ప్రధాని అయినా పేదవాడు అయిన ఎవరిని కనికరించడం లేదు. ఈ వైరస్ వల్ల అనేక దేశాలు ఆర్ధికంగా చాలా నష్టపోవడంతో పాటు ప్రాణ నష్టం కూడా చెల్లించుకున్నారు. దీంతో వైరస్ విరుగుడు కోసం అనేక దేశాల శాస్త్రవేత్తలు పగలు రాత్రి అనగా కష్టపడుతూ ఉన్నారు. ఇండియాలో కూడా ఉన్న ఫార్మా కంపెనీలు కరోనా వైరస్ మందు కనిపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయినా కానీ మొన్నటి వరకూ సరైన ఫలితాలు ఏవి కూడా రాబట్ట లేదు. ఇలాంటి సమయంలో గ్లేన్ మార్క్ ఫార్మా సంస్థ కరోనా వైరస్ కు మందు కనిపెట్టినట్లు సగర్వంగా ప్రకటించుకుంది.

 

మూడు దశల ప్రయత్నాలలో అద్భుతమైన సత్ఫలితాలు  వచ్చినట్లు తెలపటంతో వెంటనే  ఐసీఎంఆర్ కూడా దీనికి అనుమతులు ఇచ్చేసింది. కానీ ఇక్కడ కండిషన్ ఏమిటంటే ఈ మందు ప్రారంభ మరియు మధ్య దశలో వైరస్ ప్రభావం ఉన్న వారిపై మాత్రమే పనిచేస్తుందని తెలియజేశారు. దీంతో వెంటిలేటర్ పై  చికిత్స తీసుకునే క్రిటికల్ పొజిషన్ లో ఉండే రోగిపై ఎక్కువగా ఈ మెడిసిన్ ప్రభావం ఉండదని సంస్థ తెలిపింది. దీంతో చాలావరకు కరోనా వైరస్ టాబ్లెట్ వచ్చిందని తెగ సంబరపడిపోతున్నా వారు ఈ విషయం తెలుసుకుని కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు.

 

మరోపక్క యూకే శాస్త్రవేత్తలు కనిపెట్టిన స్టెరాయిడ్ తరహా కరోనా మెడిసిన్ … అది ఎక్కువగా వెంటిలేటర్ మరియు ఆక్సిజన్ తీసుకునే కరోనా రోగుల పై పని చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా కరోనా వైరస్ అరికట్టడం విషయంలో ప్రపంచంలో చాలావరకూ పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. కాగా మొదటిసారి నోటిద్వారా తీసుకునే విధంగా కరోనా మెడిసిన్ గ్లేన్ మార్క్ ఫార్మా సంస్థ రూపొందించటం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: