ఇన్నాళ్ళు మిత్ర దేశంగా వ్యవహరిస్తున్న చైనా సరిహద్దు ప్రాంతంలో సైనికుల కవ్వింపు చర్యలు ఘర్షణలకు దారి తీసిన నేపథ్యంలో ఇరు దేశాల సైనికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఎవరికివారు తమ సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులోనూ యుద్ధానికి రెడీ అన్నట్టుగా రెండు దేశాల ఆర్మీకి చెందిన వాళ్లు వ్యవహరిస్తున్నారు. సామరస్యత ను కాదని యుద్ధానికి రెడీ అయితే ఎవరి సత్తా ఎంతో అని నిరూపించుకోవడానికి వాస్తవికంగా ఇండియా చైనాలు భద్రతా బలగాల విషయంలో ఎవరు ఎంతమేర కలిగి ఉన్నారు, ఎవరికి ఎన్ని ఆయుధాలు ఉన్నాయి ఎవరి బలం ఎంతో గురించి ఒకసారి తెలుసుకుందాం.

 

ఇరుదేశాల వద్ద యుద్ధ సామాగ్రి ఎంతమేర ఉంది అని పరిశీలిస్తే ఫైటర్ జెట్ విషయంలో చైనా వద్ద 157 ఉంటే ఇండియా వద్దా 270 ఉన్నాయి. పెద్ద ట్యాంకుల విషయానికొస్తే చైనా వద్ద 3500 ఉండగా ఇండియా వద్దా 4292 ఉన్నాయి. ఇక న్యూక్లియర్ వెపన్స్ విషయానికొస్తే చైనా వద్ద 104 ఉండగా భారత్ వార్త 8 అగ్ని 3 లాంచెర్స్ ఉన్నాయి. ఇవి అన్ని చైనాని భార్య చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇక హెలికాప్టర్ల విషయానికొస్తే ఇండియాకి 772 ఉంటే చైనా వద్ద 911 ఉన్నాయి. కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియా వద్ద 538 ఉంటే చైనా వద్ద 1232 ఉన్నాయి. ఆయుధాలతో కూడిన వాహనాలు ఇండియా వద్ద 8086 కలిగి ఉంటే చైనా వద్ద  33000 ఉన్నాయి.

 

రాకెట్ ప్రొజెక్టర్లు చూసుకుంటే ఇండియా వద్ద 266 అండగా చైనా వద్ద 2650 ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ లు ఇండియా 2123 కలిగివుంటే చైనా 3210 కలిగి ఉన్నాయి. దాడి చేయగల హెలికాప్టర్ల విషయానికొస్తే  ఇండియా వద్ద 81 ఉండగా చైనా వద్ద 281 ఉన్నాయి. సబ్ మెరైన్ ల విషయానికి వస్తే ఇండియా వద్ద 16, చైనా వద్ద 74 ఉన్నాయి. మొత్తం మీద ఇండియా కంటే చైనా అత్యధిక యుద్ధ సామాగ్రి కలిగి ఉన్నప్పటికీ భారత్ బలగాల శక్తిసామర్థ్యాలకు పోటీ లేదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: