ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో శాసనమండలి లో జరిగిన అధికార ప్రతిపక్షాల మధ్య గొడవ విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ బయటకు రావాలని మాట్లాడాలని డిమాండ్ ఎక్కువగా వినబడుతోంది. ఈ విషయం లో కావాలని అధికార నేతలను రెచ్చగొట్టి బిల్లులను ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి కీలకమైన మూడు బిల్లులు ఏపీ సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులు ఏర్పాటు అదేవిధంగా ద్రవ్య బిల్లు ఈ విషయంలో రెండే రోజులు సభ ఉండటంతో తెలుగుదేశం పార్టీ సభా సమయాన్ని వృధా చేసే విధంగా శాసనసభలో గొడవ సృష్టించింది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

మరోపక్క ఈ విషయంలో టీడీపీ పార్టీ నేతలు మాట్లాడుతూ.. వైసీపీ మంత్రులు సభలో వీధి రౌడీల్లా వ్యవహరించారని విమర్శలు చేశారు. ముఖ్యంగా ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్యాంటు జిప్ తీసి అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిట్టాడని అదేవిధంగా వైసీపీ నాయకులు మూకుమ్మడిగా వీధి రౌడీ ల్లాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ లపై శాసనసభలో దాడి చేయటానికి ప్రయత్నాలు కూడా చేసినట్లు పేర్కొన్నారు.

 

ఈ విషయం గురించి ఇటీవల సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే సభా నిబంధనలకు విరుద్ధంగా నారా లోకేష్ సభలో తన సెల్ ఫోన్ తో వీడియోలు చిత్రీకరిస్తున్నారు కాబట్టి దానిని ప్రశ్నించం అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. మీడియాలో కూడా ఈ విషయం పెద్ద హైలైట్ అవ్వడంతో మొన్నటి నుండి వైసీపీ నేతలు మీడియా ముందు ఈ విషయంలో చిన్న బాబు బయటకు రావాలని మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా నారా లోకేష్ తప్పు ఉంది కాబట్టి బయటకు రాలేక పోతున్నారని దమ్ముంటే బయటకు రావాలని సవాల్ చేస్తున్నారు. శాసనమండలిలో టిడిపి నేతల తప్పు ఉంది కాబట్టి ఆయన సెల్ ఫోన్లో రికార్డు వీడియోలు బయటపడితే టీడీపీ నాయకుల బాగోతం మొత్తం బయట పడుతుంది అని అంటున్నారు. అందుకోసమే మీడియా ముందు లోకేష్ రాలేకపోతున్నారు అంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: