కొందరు మంచి ఉన్నత స్థానాల్లో ఉంటారు.. డబ్బు ఉంటుంది, కుటుంబం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, పదవి ఉంటుంది అన్ని ఉంటాయి కానీ మనశాంతి ఉండదు. ఆ మనశాంతి కోసమే ఎందరో వారికీ వారే హాని చేసుకొని ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మనం ఇలాంటి ఎన్నో ఘటనలు చూస్తూనే ఉన్నాం. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఓ పోలీసు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంకా ఈ ఘటన వసంత విహార్‌ ప్రాంతంలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయ్.. హరియాణాలోని జాజర్‌కు చెందిన సందీప్‌ కుమార్‌ ప్రత్యేక విభాగానికి చెందిన పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

 

ఇంకా శుక్రవారం రాత్రి పోలీస్‌ స్టేషన్‌లోనే ఎవరూలేని సమయంలో ఆయన తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గమనించిన మిగతా సిబ్బంది సందీప్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనే సందీప్ తుది శ్వాస వదిలారు. అయితే సందీప్ చనిపోయే ముందు ఓ ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ లో వీడియో షేర్ చేశాడు. 

 

IHG

 

ఇంకా ఆ వీడియోను పోలీసులు అతని మొబైల్ ఫోన్ లో గుర్తించారు.. ఆ వీడియో మెసేజ్ అయితే దొరికింది కానీ అతను ఆత్మహత్యకు పాల్పడ్డ స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఇంకా ఆ పోలీస్ షేర్ చేసిన ఆ వీడియోలో ఇలా మాట్లాడాడు.. ''నేను మంచి కుమారుడుని, భర్తను, సోదరుడిని కాలేకపోయాను.. ఇది నిజం'' అంటూ ఆ వీడియోలో చెప్పారు. 

 

అయితే ఈ విషయంపై వారి కుటుంబ సభ్యులు స్పందించడానికి ఇష్టపడలేదు... ఈ ఘటనకు సంబంధించి చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం సందీప్ మృతుదేహం ఆస్పత్రిలో ఉన్నట్టు.. దానిని అతని కుటుంబ సబ్యులకు అప్పగించే ముందు కరోనా పరీక్షలు చేయనున్నట్టు తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: