ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు  ఎక్కువైపోతున్నాయి . దీంతో ఏది నిజమైనది... ఏది ఫేక్  అర్ధం  చేసుకోలేని పరిస్థితి. ఇలా ఫేక్ పోస్ట్   గురించి తెలియక ఇక్కడొక  కాంగ్రెస్ సీనియర్ నేత అబాసుపాలు అయ్యాడు. నెటిజన్ల నుంచి పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. చైనాకు చెందిన ఒక యువతి పెట్టిన పోస్ట్  కు  లైక్ కొట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత... ఆ తర్వాత అది ఫేక్ పోస్ట్  అని తెలియడంతో విమర్శల పాలవుతున్నారు. ఆ కాంగ్రెస్ సీనియర్ నేత ఎవరో కాదు శషీ థరూర్ . శనివారం చైనాకు చెందిన ఈవా ఝంగ్  అనే యువతి తన సోషల్ మీడియా  ఖాతాలో ఒక వీడియో ని పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోను చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పోస్ట్ కి  లైక్  చేశారు. 

 


 అయితే చైనా యువతి పోస్ట్ చేసిన వీడియోలో  చైనా సైన్యం గాల్వన్  ఘర్షణల సందర్భంగా  గాయపడ్డ భారత సైన్యానికి చైనా సైన్యం సహాయం చేసింది అంటూ అందులో రాసి ఉంది. అంతేకాకుండా ఈ ఘటనలో అటు చైనా సైనికులు ఎవరూ మరణించలేదు అంటూ చైనాకు చెందిన సదరు యువతి సోషల్ మీడియా ఖాతాలో  తెలిపింది. అదే సమయంలో ఘర్షణలో తీవ్రంగా గాయపడి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న భారత సైనికులకు చైనా సైనిక స్థావరాలలో సహాయం అందించారు అంటూ పేర్కొంది. ఇక ఈ పోస్ట్ ని తిలకించిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్  దీనికి  లైక్ కొట్టారు. 

 


 ఇక ఆ తర్వాత ఇది చూసిన నెటిజన్లు... ఆ వీడియో గాల్వన్  ఘర్షణలకు సంబంధించిన వీడియో కాదని... 2017 సంవత్సరానికి సంబంధించిన వీడియో అంటూ కొంత మంది నెటిజన్లు గుర్తించారు . దీంతో కామెంట్లు కూడా పెట్టారు. దీంతో ఇది గమనించిన చైనాకు చెందిన  యువతి పోస్ట్  ను  డిలీట్ చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పై  ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఒకటి పోస్ట్  లో  నిజానిజాలు తెలుసుకోకుండా పోస్ట్  కి లైక్ కొట్టడం ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: