కాలం కలిసి రానప్పుడు సైలెంట్ గా ఉండాలి అన్న ఈ విషయాన్ని మర్చిపోతే ఎలా ఉంటుందో దాని ఫలితం ఇప్పుడు టీడీపీకి చెందిన కొంతమంది మాజీ మంత్రులు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడం, జగన్ పై పదేపదే అనేక అవినీతి ఆరోపణలు చేయడం వంటి ఎన్నో సంఘటనలు చోటుచేసుకోవడంతో, ఇప్పుడు ప్రతీకారం తీసుకుంటున్నట్లు వైసిపి వ్యవహరిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం అన్ని వ్యవహారాలను బయటకు తీస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అవ్వడం, మరో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

IHG


 ఇటీవలే ఆయన ఓ మహిళా మున్సిపల్ కమిషనర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నమోదు చేసుకున్న పోలీసులు నిర్భయతో పాటు, లాక్ డౌన్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఆయన అతి త్వరలోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ క్లారిటీ ఇస్తున్నారు. నర్సీపట్నం మహిళా కమిషనర్ మీద అసభ్య పదజాలంతో దూషించిన మాటలన్నీ ఆడియో, వీడియో ద్వారా రికార్డ్ అయ్యాయని, ఆధారాలతో సహా అయ్యన్న దొరికిపోయారని, వాటిని చూసి సుమోటోగా కేసు నమోదు చేశామని ఆమె అన్నారు.

 

IHG's panel chief Vasireddy Padma assures all help ...


 ఒక మహిళా కమిషనర్ వంటి వ్యక్తికే ఇటువంటి పరిస్థితి వస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. అయ్యన్న వంటి వ్యక్తికి చంద్రబాబు మద్దతు పలకడంపై ఆమె మండిపడ్డారు. మహిళలంటే టిడిపికి మొదటి నుంచి చులకన  భావం ఉందని, వారు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకోవాలా వద్దా ? వారి మీద దౌర్జన్యాలు చేస్తారా అంటూ ఆమె మండిపడ్డారు. అయ్యన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం అయ్యన్న తన మీద నమోదైన కేసులు విషయంపై హైకోర్టుకు వెళ్లారు. అయితే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారనడానికి సాక్ష్యంగా వీడియోలు ఉండడంతో ఆయన తప్పకుండా జైలుకు వెళ్తారని, మరి కొద్ది రోజుల్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకుంటాయని వాసిరెడ్డి పద్మ క్లారిటీ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: