ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయంగా అధికార పార్టీకి ఏ మాత్రం ఇబ్బంది లేకపోయినా సరే కొందరు నేతలు మాత్రం వ్యవహారశైలి ని పూర్తిగా మార్చుకోవడం మంచిది అని పలువురు సూచనలు చేస్తున్నారు. అనవసరంగా పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం మంచిది కాదు అని జ‌గ‌న్ హెచ్చరికలు చేస్తున్నార‌ని స‌మాచారం. ఒక్క‌సారిగా ప‌ది మందికి పైగా కీల‌క నేతలు, ఎమ్మెల్యేలు త‌మ అసంతృప్తి గ‌ళాలు వినిపించారు. దీంతో పార్టీలో ఒక్క‌సారిగా ఏం జ‌రుగుతుందో ?  కూడా అర్థం కాని ప‌రిస్థితి. అస‌మ్మ‌తి గ‌ళాలు వినిపించిన వాళ్ల‌కు కాస్త క్లాస్ పీక‌డంతో వాళ్లు సైలెంట్ అయ్యారు. అయితే కొంద‌రు మాత్రం ఇంకా పార్టీని న‌ష్ట‌ప‌రిచే ప‌నులు చేస్తూనే ఉన్నారు.

 

తాజాగా నెల్లూరు జిల్లా నేతలు విజయవాడలో రాజ్యసభ ఎన్నికల కోసం వచ్చి కలిసారు. ఈ సమావేశానికి ఆనం రామనారాయణ రెడ్డి సహా మరి కొందరు ఎమ్మెల్యేలు రాలేదు అని తెలుస్తుంది. సజ్జల రామ కృష్ణా రెడ్డి ఫోన్ చేసి అడిగినా సరే ఆయన రాలేదు అని సమాచారం. ఇంకో ఇద్దరు అయితే అసలు ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు అని తెలుస్తుంది. సీఎం జగన్  సంక్షేమ కార్యక్రమాల విషయంలో దూసుకుపోతున్నా సరే వీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. 

 

ఇక మాజీ మంత్రి ఆనం ప‌దే ప‌దే మీడియా ముందు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ పార్టీకి ఇబ్బందిగా మారార‌ని జ‌గ‌న్ సైతం అస‌హ‌నంతో ఉన్నార‌ట‌. ఆనం విజయవాడ లో ఉన్నా సరే సమావేశం ఉన్నా సరే కావాలి అనే రాలేదు అని వైసీపీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది అని హెచ్చరించినా సరే వారు మాత్రం వినడం లేదని, వారి మీద జగన్ కూడా ఆగ్రహంగానే ఉన్నారు అని త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని పరిశీలకులు అంటున్నారు. ఈ లిస్టులో ముందుగా న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజుపైనే చ‌ర్య‌లు ఉంటాయ‌ని.. ఆ త‌ర్వాత మిగిలిన వారిపై చ‌ర్య‌లు ఉంటాయ‌ని టాక్..?

మరింత సమాచారం తెలుసుకోండి: