ఇటీవలే ఓ పోలీస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక మంచి భర్త ను సోదరుడిని కొడుకుని కాలేకపోయాను అంటూ తీవ్ర మనస్తాపం చెందిన ఆ పోలీసు అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం గా మారిపోయింది. అయితే తీవ్ర మనస్థాపం చెందిన పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక పోలీస్ అధికారి చనిపోవడంతో అతని కుటుంబంలో విషాదం నిండిపోయింది. 

 


 వివరాల్లోకి వెళితే.. వసంత విహార్ ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్ లో  శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్యానాలోని జాజర్ కు చెందిన సందీప్ కుమార్ ప్రత్యేక విభాగానికి చెందిన పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే  శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో సందీప్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ లో అందరు సిబ్బంది ఉండగానే సందీప్ కుమార్ ఇలా  కాల్చుకున్నాడు. ఇక ఇది గమనించిన మిగతా సిబ్బంది వెంటనే సందీప్ కుమార్ ని  ఆసుపత్రికి తరలించారు.

 


 అయితే అతన్ని  పరిశీలించిన వైద్యులు మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచినట్టు నిర్ధారించారు. అయితే పోలీసు అధికారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది  చర్చనీయాంశంగా మారగా అతను ఆత్మహత్య చేసుకున్న దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. అయితే సందీప్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకునే ముందు...ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ లో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు. దీన్ని  పోలీసులు అతని మొబైల్లో గుర్తించారు. నేను మంచి కుమారుని మంచి భర్తను మంచి సోదరుని కాలేకపోయాను ఇది నిజం అని పేర్కొన్నాడు పోలీస్ అధికారి సందీప్ కుమార్. సందీప్ ఆత్మహత్యపై అటు కుటుంబ సభ్యులు స్పందించడానికి నిరాకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: