కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా ఉంటూ వస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తనను చంపుతానని కొంతమంది బెదిరిస్తున్నారని, వారి వల్ల తన ప్రాణాలకు హాని ఉందని లోక్ సభ స్పీకర్ తో పాటు, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కి రఘురామకృష్ణంరాజు. ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి కేంద్ర బలగాలతో తనకు భద్రత కల్పించాలంటూ లోక్ సభ స్పీకర్ కు రాసిన లేఖలో రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. తనను చంపుతానని బెదిరిస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఎస్పి కి రాసిన లేఖలో రఘురామ కృష్ణంరాజు వివరించారు.

IHG

 

 స్పీకర్ కు రాసిన లేఖను హోం మంత్రి కూడా పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కి రాసిన లేఖలో నలుగురు ఎస్సైల పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎంపీని అసభ్య పదజాలంతో దూషించి, దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వారిపై ఆచంట, ఆకివీడు ,ఉండి, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లలో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసినప్పటికీ ఆ స్టేషన్ ఎస్సైలు స్పందించలేదని రఘురామకృష్ణరాజు తరఫున పీఎస్ వర్మ అనే వ్యక్తి ఎస్పీ కి లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం జగన్ ఏడాది పరిపాలనపై రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు. అప్పటి నుంచి ఆయన ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారు.


 దీనికి కౌంటర్ గా రఘురామకృష్ణంరాజు మరిన్ని ఆరోణపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలా ముదురుతున్న తరుణంలో ఏకంగా ఎస్పీకి, లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా కు చెందిన ఎమ్యెల్యేలంతా రఘురామకృష్ణం రాజు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: