సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందన్న సంగతి తెలిసిందే. ఎవరినైనా అధికారంలో కూర్చోపెట్టాలన్న,అధికారంలో నుంచి దించేయాలన్నది కూడా వీరి చేతుల్లోనే ఉంది. గత 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా మహిళలు పెద్ద ఎత్తున జగన్‌కు మద్ధతు తెలపడం వల్లే, వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. అనేక హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండా మోసం చేసి, ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ పేరుతో హడావిడి చేసిన చంద్రబాబుకు మహిళలు గట్టిగానే బుద్ది చెప్పారు.

 

అయితే మహిళల మద్ధతుతో ఊహించని విధంగా భారీ మెజారిటీతో గెలిచిన జగన్...మహిళలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇచ్చిన మాట తప్పకుండా సమయానికి పథకాలు ఇచ్చేస్తున్నారు. సాధారణంగా వచ్చే పథకాలు కాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు ఇస్తున్నారు. పింఛన్లు, మద్యపాన నిషేధం, ఉద్యోగాల్లో ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం చేశారు. అటు దేశంలో ఎక్కడా లేని విధంగా పిల్లలని బడికే పంపే తల్లులకు అమ్మఒడి పథకం ఇచ్చారు.

 

ఈ పథకంతోనే చాలామంది మహిళల మద్ధతు జగన్‌కు దక్కింది. అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా అమలు చేయడం పట్ల ప్రతి తల్లి సంతోషం వ్యక్తం చేసింది. ఇక కరోనా సమయంలో కూడా సున్నా వడ్డీ పథకం అందించి జగన్ మహిళలకు అండగా నిలిచారు. ఇక త్వరలోనే కాపు మహిళలకు కాపు నేస్తం ద్వారా రూ. 15 వేలు ఇవ్వడం, వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమయ్యారు.

 

ఈ పథకం ద్వారా 24 లక్షల నుంచి 25 లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందుతారు. ఆగస్టు 12న ఈ పథకం మొదలు కానుంది. ఈ పథకం తర్వాత మహిళల నుంచి జగన్‌కు అదిరిపోయే సపోర్ట్ రానుంది. వీరి మద్ధతు ఫుల్‌గా వచ్చేస్తే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా జగన్‌దే సీఎం పీఠం..ఇంకా ఆ దెబ్బతో బాబుకు దిమ్మతిరగడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: