కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వేలకు వేలు ప్రజలు ఈ కరోనా భారిన పడి మృతి చెందుతున్నారు. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ని మన దేశంలో నియంత్రించేందుకు దాదాపు రెండు నెలలలకు పైగా లాక్ డౌన్ అమలు చేసారు.. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. 

 

కరోనా వైరస్ ఎఫెక్ట్ అతి దారుణంగా పడింది. రోజు రోజుకు ఈ కరోనా వైరస్ పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. దేశంలో కరోనా వైరస్ ప్రవేశించిన ప్రారంభంలో తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి కరోనా భాదితులకు చికిత్స అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి మూడు నెలల పాటు రూ.50లక్షల ప్రమాద బీమా పథకం ఇస్తున్నట్టు మొదట్లో కేంద్ర ప్రకటించింది. 

 

అయితే.. ఆ మూడు నెలల గడువు ఇప్పుడు పూర్తి కావడంతో మరో మూడు నెలల పాటు గడువును పెంచింది. ఎందుకంటే కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. మార్చి 30న ప్రకటించిన ఈ వ్యక్తిగత ప్రమాద బీమా గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నడంతో ఈ బీమా సదుపాయం సెప్టెంబర్‌ వరకు అమలు చేయనుంది. 

 

ప్రధానమంత్రి గరీబ్‌‌ కల్యాణ్‌ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మార్చిలో ప్రకటించిన ఈ బీమా పథకాన్ని దేశవ్యాప్తంగా 22.12 లక్షల మందికి వర్తింపజేసిన విషయం తెలిసిందే. మరి ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఎప్పుడు తగ్గి సాధారణ స్థితికి వస్తుందో చూడాలి. ఏది ఏమైనా కరోనా వైరస్ మనిషి జీవనాన్ని పూర్తిగా మార్చేసింది.                              

మరింత సమాచారం తెలుసుకోండి: