మాట తప్పను మడమ తిప్పను అనే పదాన్ని దివంగత రాజశేఖరరెడ్డి పదేపదే చెబుతూ ఉండేవారు. ఆ విధంగానే ఆయన కుమారుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా అదే విషయాన్ని పదేపదే చెబుతూ వస్తున్నారు. చెప్పడమే కాదు ఆ మాటను కూడా అక్షరాలా నిజం చేసి చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే దాదాపు తాను ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి సరికొత్త రికార్డు సృష్టించడమే కాకుండా, తాను పదే పదే చెప్పే విలువలు, విశ్వసనీయత అనే మాటను నిజం చేసి చూపిస్తున్నారు. 151 సీట్లతో వైసిపి అతిపెద్ద విజయాన్ని ఏపీలో సొంతం చేసుకుంది. జగన్ దెబ్బకు ఘనమైన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ కకలావికలమైంది. ఆ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ నమోదు కాని ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. ఇదంతా జగన్ అనే ఒక వ్యక్తి గొప్పతనమే.

 


 ఇదిలా ఉంటే జగన్ ఏడాది పాలన పై ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం ఉంది ?  ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా ? ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా ? అసలు జగన్ ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు ? ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు ? ఇప్పటికిప్పుడ ఎన్నికలు జరిగితే వైసీపీ, తెలుగుదేశం మిగతా రాజకీయ పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వంటి విషయాలను ఓ సర్వే సంస్థ బయట పెట్టింది. సెంటర్ ఫర్ సెఫాలజీ  స్టడీస్ (సిపిఎస్ ) అనే ఓ సంస్థ సర్వే చేపట్టి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. ఆ సర్వేలు 62.6 శాతం మంది ప్రజలు జగన్ పనితీరు బాగుంది అని చెప్పగా, 36.1 శాతం మంది బాగోలేదని చెప్పినట్లు ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది. వాస్తవంగా చెప్పుకుంటే జగన్ పనితీరు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంటే ఆదర్శనీయం.

 


 ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరి ఎక్కడా అమలు కావడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా , ప్రజలు ఎవరికి ఏ లోటు రాకుండా, జగన్ సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా, వివిధ పథకాల పేరుతో జనాల అకౌంట్లో డబ్బులు కూడా వేస్తున్నాడు. ఇక అమరావతి ప్రాంతంలో జగన్ కు  వ్యతిరేకంగా అభిప్రాయం రావాల్సి ఉన్నా, ఆశ్చర్యకరంగా అక్కడ 55 శాతం మంది ప్రజలు జగన్ పరిపాలన పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి అంటూ పెద్ద ఎత్తున ఆ ఈ ప్రాంతంలో ఉద్యమాలు, ఆందోళనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. అయినా అక్కడ జగన్ పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం, జగన్ కు కలిసొచ్చే అంశంమే. 


ఇక నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, పదేపదే చెబుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగ్గా లేదు అనే లెక్కలు కూడా బయటకు వచ్చాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 38.5% ఓట్లు సంపాదించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 38.3 శాతం మాత్రమే ఓట్లు వస్తాయని తేలిందట. అంటే గతం కంటే తెలుగుదేశం పార్టీ కి ఉన్న ఆదరణ మరింత తగ్గింది. అలాగే అమరావతిలో ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుందని పదేపదే చెబుతూ వస్తున్న మాటలు అబద్దం అనే విషయం తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: