ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రికార్డుస్థాయి ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు. ఫస్టియర్ లో నాలుగు లక్షల 80 వేల 555 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా 2 లక్షల 88 వేల 383 మంది విద్యార్థులు పాస్ అయ్యారు... ద్వితీయ సంవత్సరం లో నాలుగు లక్షల 11 వేల 631 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2 లక్షల 83 వేల 462 మంది విద్యార్థులు పాస్ అయ్యారు... ఫెయిల్ అయిన విద్యార్థులు, మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డ్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇంటర్ పలితాలు వెలువడిన నెల లోపే ఈ పరిక్షలు జరుగుతాయి.

 

ఇంటర్ పరీక్ష పలితాలు విడుదల చేసే రోజే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా తేదీలు ప్రకటిస్తారు కానీ ఈ సారి ప్రకటించలేదు.. దీంతో జులై లో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుందా  అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి... కరోన కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.. కరోన ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో తెలియని పరిస్థితి... ఇప్పుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పెడితే దాదాపు గా నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యే అవకాశం ఉంది.

 

ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది... అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ద్వారా ఫస్ట్ ఇయర్ లో నాలుగేళ్లుగా ఎంత మంది పాసయ్యారు, సెకండియర్లో  అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉపయోగించుకొని ఎంతమంది ప్రయోజనం పొందారని సగటు తీసి ఆ సగటు ఆధారంగా ఈ సారి విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించకుండానే పాస్ చేయాలని ఇంటర్ విద్యా జాక్ డిమాండ్ చేస్తోంది...విద్యార్థులకి మార్క్ లు కలపాలని విజ్ఞప్తి చేసింది.. ఫస్ట్ ఇయర్ లో 40 వేలు, సెకండ్ ఇయర్ లో 50 వేల మంది విద్యార్థులు పాస్ అవుతారని ఇంటర్ విద్యా జాక్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి అన్నారు.. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలని సీఎం కి లేఖ రాశారు... ఫస్ట్ ఇయర్ అయిపోయిన విద్యార్ధులు ఇంప్రూవ్ మెంట్ రాసుకోవాలి అనుకుంటే తర్వాత అవకాశం ఇవ్వొచ్చన్నారు.

 

అయితే ...ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం, ఇంటర్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది...దీనికి సంబంధించి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: