ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం జగన్, సీఎం కేసీఆర్ నీటి వనరులను పూర్తిగా వినియోగించే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించే ప్రయత్నాలు చేసినా అవి సక్సెస్ కాకముందే ఆయన అధికారం కోల్పోయారు. అయితే ఈ రెండు రాష్ట్రాల సీఎంలు నీటిపై ఇంతలా దృష్టి పెట్టటానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎడారీకరణ వైపుకు మళ్లిపోతూ ఉండటంతో ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో జరిగిన ఒక సర్వే ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో ఇప్పుడు ఉన్న వాతావరణానికి పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. మనం నీటి వనరులను సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. 
 
రిమోట్ సెన్సిటివ్ డేటాల ఆధారంగా చేసిన సర్వేలో 2013 నాటికే ఏపీలో 14.35 శాతం, తెలంగాణలో 31.4 శాతం, కర్ణాటకలో 36.22 శాతం ఎడారీకరణ వైపుకు వెళ్లిపోతున్నట్టు తేలింది. ప్రపంచంలోని మూడో వంతు భూభాగం ఇదే పరిస్థితిలో ఉంది. 360 కోట్ల హెక్టార్ల భూమి ఎడారిగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకు సంబంధించిన లెక్కలు చూసుకుంటే ఏపీలో 2003 - 2005 మధ్యలో 22,65,728 హెక్టార్ల ప్రాంతం ఎండిపోయిందని తేలింది. 
 
2011 - 2013 నాటికి 22,98,758 హెక్టార్ల భూమి ఎండిపోయినట్టు తేలింది. తెలంగాణలో 2003 - 2005 మధ్యలో 36,58,456 హెక్టార్లు 2011 - 2013 సంవత్సరానికి 35,98,856 హెక్టార్లకు తగ్గింది. తెలంగాణలో ఈ మధ్య కాలంలో పెరిగిన నీటి వనరుల వల్ల ఎడారి భూమి తగ్గుతుండగా ఆంధ్రాలో కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో చాలా మారాల్సి ఉంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: